పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనపరిచిన సూర్య హై స్కూల్ విద్యార్థులు


విశాలాంధ్ర ధర్మవరం; పదవ తరగతి పరీక్ష ఫలితాలలో సూర్య హై స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరిచి విజయ దుందుభిని మోగించడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ నరేంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 564 మార్కులు లను ఎస్ మహమ్మద్ షాహిద్ పాఠశాల టాపర్గా నిలిచారని, 546 మార్కులతో రూపసనా, 532 మార్కులతో లక్ష్మీనారాయణ రెడ్డి కైవసం చేసుకున్నారని తెలిపారు. అదేవిధంగా సూర్య ట్యుటోరియల్ నందు కోచింగ్ తీసుకున్న దీపకళ 588 మార్కులు, మహర్ స్వప్న 582 మార్కులు , వరుణ్ కుమార్ రెడ్డి 581 మార్కులు, హాసిని 578 మార్కులు సాధించారని తెలిపారు. 500 మార్కులు పైగా 30 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ నరేంద్ర బాబుతో పాటు డైరెక్టర్ విజయలక్ష్మి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *