Today Top 10 News: హర్మూజ్‌ జలసంధిలో ఉద్రిక్తత.. ఇరాన్ దాడుల్లో భారతీయులకు గాయాలు | తెలంగాణ వార్తలు


పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ 90 లక్షల ఓట్లను తొలగించడం వల్లే బీజేపీకి లబ్ధి చేకూరిందని ఆమె ఆరోపించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేయనని సంచలన ప్రకటన చేశారు. ఇండియా కూటమి బలోపేతం కోసం తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

2. స్టాలిన్ ఓటమిపై కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

తమిళనాడులో విజయ్ సాధించిన విజయంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. తన శాపం వల్లే స్టాలిన్ ఓడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతి పాలనపై ప్రజలు సాధించిన విజయమని దీనిని అభివర్ణించారు. తనను అనుసరించే యువత ఓట్లు వేయడం వల్లే విజయ్ గెలిచారని పాల్ విశ్లేషించారు.

3. మే 9న బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం

పశ్చిమ బెంగాల్‌లో మే 9న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజున నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ నేత సమీక్ భట్టాచార్య తెలిపారు. ఠాగూర్ ఆశీస్సులతో రాష్ట్రంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే సీఎం ఎవరనేది పార్టీ ఇంకా ప్రకటించలేదు.

4. చిల్లర రాజకీయాలు వద్దు..

బెంగాల్‌లో టీఎంసీ ఓటమిని కాంగ్రెస్‌లోని కొందరు వేడుక చేసుకోవడంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఒక పార్టీ సమస్య కాదని, దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయమని అన్నారు. అందరూ కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

5. ఎల్లుండి తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ వేడుక ఘనంగా జరగనుంది. ఇప్పటికే తన పార్టీ ఎమ్మెల్యేలను ఆయన మహాబలిపురంలోని రిసార్ట్‌కు తరలించారు. రేపు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై విజయ్ అధికారికంగా విన్నవించనున్నారు.

6. బీజేపీపై మంత్రి కొండా సురేఖ విమర్శలు

బీజేపీ నేతలు కేవలం ‘జై శ్రీరామ్’ నినాదాలతో కాలం గడుపుతున్నారని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. ఆ నినాదాలు చేస్తే ప్రజల ఖాతాల్లో డబ్బులు పడతాయా అని ఆమె ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నోరు మెదపడం లేదని మండిపడ్డారు. మోదీ వచ్చి హిందీలో మాట్లాడి వెళ్తే సమస్యలు తీరవని ఎద్దేవా చేశారు.

7. హర్మూజ్‌ జలసంధిలో ఉద్రిక్తత

హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలను విడిపించేందుకు అమెరికా ‘ప్రాజెక్ట్ ఫ్రీడం’ చేపట్టింది. ఈ క్రమంలో తమ యుద్ధ నౌకలు జలసంధిలోకి వెళ్తాయని ట్రంప్ ప్రకటించారు. అయితే అమెరికా నౌకపై క్షిపణి దాడి చేశామని ఇరాన్ ప్రకటించడంతో వాతావరణం వేడెక్కింది. అమెరికా మాత్రం తమ నౌకలపై ఎలాంటి దాడులు జరగలేదని స్పష్టం చేసింది.

8. ఇరాన్ దాడుల్లో భారతీయులకు గాయాలు

యూఏఈలోని చమురు కేంద్రంపై ఇరాన్ చేసిన డ్రోన్ దాడిలో ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. ఈ ఘటనను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని హితవు పలికింది. పశ్చిమాసియాలో శాంతి కోసం చర్చలు జరపాలని భారత్ కోరింది.

9. కొత్త ప్రభుత్వంపై సూర్య ఫ్యాన్స్ ఆశలు

సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమా మే 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతి ఇవ్వాలని అభిమానులు కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విజయ్ సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాబట్టి తమ విన్నపాన్ని మన్నిస్తారని వారు భావిస్తున్నారు. తమిళనాడులో చాలా కాలంగా ఉదయం షోలపై ఉన్న ఆంక్షలు తొలగుతాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

10. ఓటీటీలోకి ‘పాపం ప్రతాప్’

తిరువీర్ ప్రధాన పాత్రలో నటించిన ‘పాపం ప్రతాప్’ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించిన ఈ చిత్రం మే 7న ఈటీవీ విన్ వేదికగా రానుంది. ఎస్పీ దుర్గా నరేశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *