వైయస్సార్సీపి జాయింట్ సెక్రెటరీ గడ్డం కుళ్లాయప్ప
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని కాయగూరల మార్కెట్లో ప్రతి సోమవారం 1000 లీటర్ల మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వైఎస్సార్సీపి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ గడ్డం కుళ్లాయప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం గత రెండు నెలలుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, రైతులు, చుట్టుప్రక్కల గ్రామ, పట్టణ ప్రజలకు కొంతవరకు దాహార్తిని తీర్చేందుకు ఈ మధ్యగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు కూడా ఎండాకాలంలో తగిన జాగ్రత్తలను వైద్యులు సూచించడమేరకు పాటించాలని తెలిపారు. కావున ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.


