మానస నృత్య కళాకేంద్రం గురువు మానస
విశాలాంధ్ర ధర్మవరం:: నృత్య కళను విస్తరించడమే నా ధ్యేయము అని మానస నృత్య కళాకేంద్రం గురువు మానస తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాక వరసిద్ధి దేవాలయము నందు’శ్రీ కాణిపాక విగ్నేశ్వరునికి నృత్య నీరాజనం అనే కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా, శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఎస్బిఐ కాలనీకి చెందిన నాట్య కళాకారిణి మానస వారి శిష్య బృందం ఆధ్వర్యంలో విగ్నేశ్వరునికి నృత్యాలను చిన్నారులు చేసిన తీరు భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. గురువు మానస మాట్లాడుతూ మాకు కాణిపాకములో ఇటువంటి అవకాశం ఇవ్వడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తదుపరి దేవస్థానం కమిటీ వారిచే గురువు మానసను ఘనంగా సత్కరించి, శిష్య బృందమునకు షీల్డ్ను అందించడం జరిగింది.


