అధికారులను వేధించడానికి ‘ఆర్‌టీఐ’ని వాడొద్దు
ఏపీ సమాచార కమిషన్ వ్యాఖ్యఅమరావతి: పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు తీసుకువచ్చిన సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) వినియోగంపై ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ కీలక వ్యాఖ్యల చేసింది. ఈ చట్టాన్ని వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి, ప్రభుత్వ అధికారులను వేధించడానికి వినియోగిస్తే సహించబోమని తేల్చి చెప్పింది. ఆర్‌టీఐని దుర్వినియోగం చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ఆర్టీఐ చట్టాన్ని బాధ్యతాయుతంగా వినియోగించాలని ప్రధాన సమాచార కమిషనర్ సూచించారు. మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు సంబంధించిన కేసులో…


