ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక!


తెల్లవారుజామున తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డ వైనం
మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరు పర్యటన ముగించుకుని అర్ధరాత్రి 2 గంటలకు విజయవాడ చేరుకున్న ఆయనకు, తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణంలో విమానం ఆలస్యం కావడం, విశ్రాంతి లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, గవర్నర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.

The post ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక! appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *