పెరూ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ – Visalaandhra


వామపక్ష అభ్యర్థి సాంచెజ్ ఆధిక్యత

లిమా: పెరూ అధ్యక్ష ఎన్నికలు కన్జర్వేటివ్ అభ్యర్థి ఫుజిమోరి, వామపక్ష అభ్యర్థి సాంచెజ్‌కు మధ్య హోరాహోరీగా సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా ఈ ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే 96.27 శాతం ఓట్లT లెక్కించగా, వామపక్ష నేత సాంచెజ్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. సాంచెజ్‌కు 50.10 శాతం ఓట్లు రాగా ఫుజిమోరికి 49.90 శాతం పోలయ్యాయి. సాంచెజ్‌కు గ్రామీణ ప్రాంతంలో ఆధిక్యత లభించింది. ఈ మేరకు పెరూ ఎన్నికల యంత్రాంగం ద్వారా తెలిసింది. కాగా, దేశంలో ఇటీవల నెలకొన్న రాజకీయ అస్థిరతతో తాజా ఎన్నికకు ప్రాధాన్యత ఏర్పడింది. రాజీనామాలతో అస్తవ్యస్థంగా ఉన్న రాజకీయ వ్యవస్థ నేపథ్యంలో కాబోయే అధ్యక్షుడి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. సాంచెజ్, ఫుజిమోరి మధ్య ఓట్ల తేడా స్వల్పంగానే ఉండటంతో విజేత ఎవరన్నది ఉత్కంఠభరింతగా ఉంది. దీనిపై కొద్ది రోజుల్లో స్పష్టత రావచ్చు. సాంచెజ్ (57) మాజీ అధ్యక్షుడు, వామపక్ష నాయకుడు పెడ్రో కాస్టిల్లో ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిగా పనిచేశారు. 2006లో మున్సిపల్ ఎన్నికల్లో పెరువియన్ హ్యూమనిస్ట్ పార్టీ తరపున హురాల్ మేయర్ పదవికి పోటీ చేశారు. 2020లో హురాల్ ప్రావిన్షియల్ మున్సిపాలిటీకి మేనేజర్‌గా పని చేశారు. ఆ తరువాత వామపక్ష టుగెదర్ ఫర్ పెరు పార్టీలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 2022లో అధ్యక్షుడయ్యారు. పేదరిక నిర్మూలన, పౌరుల భాగస్వామ్యం ద్వారా కొత్త రాజ్యాంగాన్ని రూపొందిస్తానని పెరియన్లకు ఇచ్చిన హామీ నేపథ్యంలో ఆయనకు గ్రామీణ ప్రాంతంలో ఆదరణ పెరిగింది. పోలీసు సంస్కరణల అమలునకు ఇచ్చిన హామీ సైతం ప్రజలను ఆకర్షించింది. సాంచెజ్ ప్రత్యర్థి ఫుజిమోరి మాజీ అధ్యక్షుడు ఆల్బెర్టో కుమార్తె. ప్రస్తుత ఫలితాలు 2021 ఎన్నికలను తలపిస్తున్నాయని, అప్పటి ఎన్నికల్లో ఫుజిమోరికి 50.1 శాతం, ఉపాధ్యాయుడు పెట్రోకి 49.9 శాతం ఓట్లు వచ్చాయి. విజేతను తేల్చడానికి సమయం పట్టింది. ప్రస్తుతం అలాంటి పరిస్థితే కనిపిస్తున్నట్లు విశ్లేషకులు అన్నారు. వారాల సమయం పట్టవచ్చని భావిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *