Murder Attempt: వివాహేతర సంబంధం పెట్టుకున్న అక్క ప్రాణాలు తీద్దామని కిరాతకంగా కొడవలితో నరికిన ఇద్దరు తమ్ముళ్లు.. కానీ లాస్ట్‌కి ఏమైందో తెలుసా.. | కర్నూల్ వార్తలు (Kurnool News)


Last Updated:

Murder Attempt: కర్నూలు జిల్లా పెద్దకడబూరులో వివాహేతర సంబంధం వివాదంగా మారి, అక్కను తమ్ముళ్లు కొడవలితో నరికి పారిపోగా, మహిళ కర్నూలు GGHలో ప్రాణాపాయంలో ఉంది

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబ పరువు తీసిందనే ఆగ్రహంతో కన్న తమ్ముళ్లే కాలయముళ్లుగా మారారు. తమ అక్కను అత్యంత పశుపక్షాదులకన్నా హీనంగా కొడవలితో విచక్షణారహితంగా నరికి, చనిపోయిందని భావించి వదిలివెళ్లిన ఘోరం కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం… పెద్దకడబూరు మండలం ముచ్చుగిరిలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘాతుకానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఈ దాడి వెనుక ఉన్న నేపథ్యం కింద ఇవ్వబడింది.

బాధిత మహిళకు దాదాపు 20 సంవత్సరాల క్రితం ఆదోని మండలం పర్వతాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే, కొన్నేళ్ల తర్వాత భార్యాభర్తల మధ్య తీవ్ర మనస్పర్థలు రావడంతో వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఒక కుమార్తె తండ్రి వద్ద, మరో కుమార్తె తల్లి వద్ద ఉండిపోయారు. భర్తకు దూరమైనప్పటి నుంచి సదరు మహిళ తన పుట్టినిల్లయిన పెద్దకడబూరు మండలం ముచ్చుగిరి గ్రామంలోనే నివాసం ఉంటోంది. అక్కడే కూలీ పనులకు వెళ్తూ తన కుమార్తెను సాకుకుంటూ జీవనం సాగిస్తోంది.

గ్రామంలో ఒంటరిగా ఉంటున్న ఈమెకు, అదే గ్రామానికి చెందిన మాజీ ఫీల్డ్ అసిస్టెంట్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, సదరు వ్యక్తి అంతటితో ఆగకుండా, తన స్నేహితుడితో కలిసి ఆ మహిళతో ఏకాంతంగా గడిపిన సమయాలను మొబైల్‌లో వీడియోలు చిత్రీకరించాడు.

విషయం ఇక్కడితో ఆగక, ఆ రాసలీలల వీడియోలను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా విపరీతంగా వైరల్‌గా మారాయి. ఈ వీడియోలు గ్రామంలోని వారందరికీ, అలాగే ఆమె కుటుంబ సభ్యుల వరకు చేరాయి. తమ అక్క చేసిన పని వల్ల సమాజంలో, గ్రామంలో తమ కుటుంబ పరువు పూర్తిగా గంగలో కలిసిపోయిందని ఆమె తమ్ముళ్లు ఇద్దరు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. తమకు అవమానం తెచ్చిన అక్కను బతకనివ్వకూడదని, ఆమెను హతమార్చాలని ఒక పక్కా ప్లాన్ వేశారు.

సోమవారం రాత్రి ప్లాన్ ప్రకారం తమ్ముళ్లిద్దరూ కొడవలితో ఆమెపై దాడికి దిగారు. ఇంట్లోకి ప్రవేశించి, పరువు తీస్తావా అంటూ ఆమెతో తీవ్రంగా గొడవ పడ్డారు. ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో చేతిలో ఉన్న కొడవలితో ఆమె తల, మెడ, చేతులపై విచక్షణారహితంగా నరికారు. రక్తం మడుగులో దారుణంగా గాయపడిన ఆ మహిళ అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయింది. ఆమె చనిపోయిందని భావించిన తమ్ముళ్లు.. సదరు మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వీడియోలు తీసిన ఫీల్డ్ అసిస్టెంట్ స్నేహితుడి ఇంటి వద్ద ఆమెను పడేసి, అక్కడి నుంచి పరారయ్యారు.

మంగళవారం ఉదయం తీవ్ర గాయాలతో పడి ఉన్న మహిళను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పెద్దకడబూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆమె ఇంకా ఊపిరితోనే ఉండటాన్ని గమనించారు. తక్షణమే చికిత్స నిమిత్తం ఆమెను ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

అయితే, ఆమె శరీరం నుంచి తీవ్రంగా రక్తం స్రావం కావడం, గాయాలు చాలా లోతుగా ఉండటంతో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం పోలీసులు ఆమెను కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)కి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ మృత్యువుతో పోరాడుతోంది.

ఈ ఘోర ఉదంతంపై పెద్దకడబూరు హెడ్ కానిస్టేబుల్ రామయ్య మాట్లాడుతూ.. బాధితురాలి పరిస్థితి ఆధారంగా హత్యాయత్నం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దాడికి పాల్పడి పరారీలో ఉన్న నిందితుల (తమ్ముళ్ల) కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటన స్థానిక ప్రాంతంలో తీవ్ర సంచలనం రేపింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *