Last Updated:
మే 20న విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా, QUCEV, Quess, Apollo వంటి కంపెనీలు 500కిపైగా ఉద్యోగాలు, 15 నుంచి 40 వేల జీతం, 18-35 ఏళ్ల వారికి అవకాశం
ఉత్తరాంధ్ర నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త . విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో మే 20న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మోడల్ కెరీర్ సెంటర్, యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో (UEI & GB) అధికారులు ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలోని యుఈఐజీబీ విభాగంలో ఈ జాబ్ మేళా ప్రారంభం కానుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ భారీ ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు యుఈఐజీబీ డిప్యూటీ చీఫ్ కె. దొరబాబు వెల్లడించారు.
ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. QUCEV Technologies Pvt Ltd, Quess Corp Limited (Foxconn), Apollo Pharmacies 3 Limited సహా పలు ప్రముఖ సంస్థలు వివిధ విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. మొత్తం 500కిపైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు అర్హతలు, అనుభవం ఆధారంగా నెలకు రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం అందించే అవకాశం ఉందన్నారు.
ఉద్యోగాలకు ఎంపికైన వారు విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, తుని ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చని స్పష్టం చేశారు. SSC, ITI, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్, MBA, B.Pharmacy, D.Pharmacy, M.Pharmacy పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. PCI సర్టిఫికెట్ కలిగిన ఫార్మసీ అభ్యర్థులకు ప్రత్యేక అవకాశాలు ఉండనున్నాయని తెలిపారు.
ఇంటర్వ్యూల కోసం ముందుగా https://www.ncs.gov.in మరియు https://employment.ap.gov.in వెబ్సైట్లలో రిజిస్ట్రేషన్ చేసుకుని అడ్మిట్ కార్డుతో హాజరుకావచ్చని సూచించారు. అయితే, ముందుగా రిజిస్ట్రేషన్ చేయని అభ్యర్థులకు స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. మరిన్ని వివరాల కోసం 9666092491 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఈ జాబ్ మేళా మంచి అవకాశంగా మారనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Visakhapatnam,Andhra Pradesh



