Midday Meal Scheme: స్టూడెంట్స్‌కి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. మరో 3ఏళ్లు ఆ పథకం కొనసాగిస్తూ ఒప్పందం | గుంటూరు వార్తలు (Guntur News)


Last Updated:

Midday Meal Scheme: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలు, ఎయిడెడ్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్ధులకు నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తోంది. ఇప్పటికే స్కూల్స్, కాలేజీలో అమలు చేస్తున్న మెనూ మార్చడం కారణంగా మధ్యాహ్న భోజనం తినే విద్యార్ధుల సంఖ్య పెరగడంతో మరింత శ్రద్దపెట్టింది.

Midday Meal Scheme
Midday Meal Scheme

Midday Meal Scheme: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలు, ఎయిడెడ్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్ధులకు నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తోంది. ఇప్పటికే స్కూల్స్, కాలేజీలో అమలు చేస్తున్న మెనూ మార్చడం కారణంగా మధ్యాహ్న భోజనం తినే విద్యార్ధుల సంఖ్య పెరగడంతో మరింత శ్రద్దపెట్టింది. ఏపీలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్ధులకు పోషక విలువలతో కూడిన రాగిజావ పంపిణి చేస్తోంది. దీన్ని మరో మూడేళ్ల పాటు కొనసాగించేందుకు శ్రీసత్యసాయి సేవా ట్రస్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రాగిజావ పంపిణి కార్యక్రమాన్ని శ్రీసత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతోనే రెండున్న ఏళ్లుగా అమలు చేస్తోంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లు పొడిగిస్తున్నట్లుగా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

మెనూ కంటిన్యూ..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్, ఎయిడెడ్ స్కూల్స్‌లో చదువుతున్న స్టూడెంట్స్ కోసం సన్న బియ్యంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందజేస్తోంది. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ విద్యార్ధుల వరకు ఈ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తోంది. ఇటీవల టెన్త్ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు తమ ప్రతిభను చాటుకోవడమే కాకుండా ప్రైవేట్ స్కూల్ విద్యార్ధులతో పోటీ పడి స్టేట్ ర్యాంకులు సాధించారు. ఈసందర్భంలోనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్ధులకు అందించే భోజనం రుచి, శుచిగా వడ్డించేలా ఉండాలని భావించారు. ఇందులో భాగంగానే స్టూడెంట్స్‌కి అదనపు పోషకాహారం అందించే ఆలోచనతో శ్రీసత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో రాగిజావ పంపిణి చేస్తోంది.ఈ రాగిజావ విద్యార్దులను చురుగ్గా, ఆరోగ్యవంతంగా ఉంచుతుందనే ఆలోచనతోనే ఈ రాగిజావ పంపిణి కార్యక్రమాన్ని రాబోయే మూడేళ్ల పాటు కొనసాగించేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగానే శ్రీసత్యసాయి సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జే రత్నాకర్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈవిషయాన్ని మంత్రి నారా లోకేష్ స్వయంగా ఎక్స్ ద్వారా తెలియపరిచారు.

మధ్యాహ్న భోజనంతో రాగిజావ..

కూటమి ప్రభుత్వానికి మరో మూడేళ్లు గడువు ఉంది. అంటే 2026-29 కాలానికి విద్యార్థులకు రాగి-జావ పంపిణీ కార్యక్రమం కొనగిస్తున్నట్లుగా ప్రకటించారు. 2023లో ప్రారంభమైన పౌష్టికాహార పంపిణి కార్యక్రమాన్ని మరో మూడేళ్లు నిర్విరామంగా కంటిన్యూ చేయనుంది. విద్యార్ధులు పెట్టే మధ్యాహ్న భోజనం మెనూలో ఫోర్టిఫైడ్ ఫైన్ రైస్, వారానికి 5 సార్లు గుడ్డు, వారానికి మూడు సార్లు చిక్కీ, అలాగే పోషకాహారపు పదార్థులుగా చిక్కీలేని రోజుల్లో రాగిజావను వారానికి మూడు సార్లు అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంపై ప్రభుత్వం ఏడాదికి సుమారు 1,850 కోట్లు ఖర్చుచేస్తోంది. తద్వారా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్, అటెండెన్స్, డ్రాప్ అవుట్స్ నివారణ, పోషకస్థాయిలు మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది.

కొనసాగిస్తూ ఒప్పందం..

విద్యార్థులకు హెల్త్ సప్లిమెంట్‌గా రాగిజావను పంపిణీ చేస్తున్నారు. 10 గ్రాముల రాగి పిండి, 10 గ్రాముల బెల్లం పొడిని 150 మిల్లీలీటర్ల వేడినీటిలో కలిపి విద్యార్థులకు అందించడం జరుగుతోంది. తద్వారా కాల్షియం, ఐరన్‌తో సమృద్ధిగా ఉండి పోషకాహారాన్ని మెరుగుపరుస్తుంది. రాగిపిండి, బెల్లంపొడిని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఉచితంగా అందిస్తుంది. ట్రస్ట్ ద్వారా జిల్లా కేంద్రాల వరకు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి పౌరసరఫరాల శాఖ ద్వారా పాఠశాలలకు పంపిణీ చేస్తారు. ఇందుకోసం మూడేళ్లలో రూ.80 కోట్ల వరకు వెచ్చించనున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *