కౌంటింగ్ వేళ…కరెంట్ కట్, సీసీటీవీలు ఆఫ్: మమత


కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అధికార పగ్గాల కోసం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 293 స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన క్రమంలో సీఎం మమతా బెనర్జీ బీజేపీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోతలు చోటుచేసుకున్నాయి, సీసీటీవీ కెమెరాలు కూడా ఆఫ్ అయ్యాయని పేర్కొన్నారు. బీజేపీ ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయంటూ ఆమె సోమవారం ఉదయం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. హుగ్లీలోని సెరంపుర్, నాడియాలోని కృష్ణానగర్, బుర్ద్వాన్‌లోని ఆస్‌గ్రామ్, కోల్‌కతాలోని క్షుదీరమ్ వంటి ప్రాంతాల్లో దశలవారీగా విద్యుత్ కోతలు జరిగినట్లు తనకు నివేదికలు వచ్చాయని మమతా తెలిపారు. సీసీటీవీలను కూడా ఆఫ్ చేశారని, స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణంలోకి వాహనాల రాకపోకలు సాగుతున్నాయన్నారు. ఈ చర్యలన్నీ బీజేపీ ఆదేశాల మేరకే జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కాపలా కాయాలని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే…వెంటనే ఫిర్యాదు చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *