ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కు నీలూరి వెంకట స్వామి విరాళం


విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధి కోసం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులు, చేనేత ప్రముఖులు నీలూరి వెంకటస్వామి తన వంతుగా కళాశాలకు 25 వేల రూపాయల నగదును ప్రిన్సిపాల్ వనిత వానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో బాలికల జూనియర్ కళాశాల చదువులోనూ, క్రమశిక్షలను మంచి గుర్తింపు పొందడం వల్ల తాను ఈ సహాయాన్ని అందించడం జరిగిందని తెలిపారు. ఈసందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తమ కళాశాల అభివృద్ధి కోసం విరాళం అందించిన దాత నీలూరు వెంకట స్వామి కికళాశాల అభివృద్ధి కమిటీ తరుపున బండి వేణుగోపాల్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో అధ్యాపకులు జుబిన్ తాజ్, మల్లికార్జున, వనిత, సునీతా తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *