Last Updated:
Godavari Bridge History: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సామర్ధ్యం కలిగి, ఇంజనీరింగ్ ప్రతిభకు సాక్ష్యంగా నిలిచిన నిర్మాణాల్లో ఒకటి రాజమండ్రి గోదావరి నదిపై నిర్మించినది కాటన్ బ్యారేజ్. దవళేశ్వరం ఆనకట్టను బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ నిర్మించడంతో దీన్ని కాటన్ బ్యారేజ్ అని పిలుస్తారు. ఉభయగోదావరి జిల్లా ప్రజల ప్రయోజనార్ధం కట్టిన ఈ వంతెనకు మరో రికార్డు కూడా ఉంది.
Dhavaleswaram Barrage: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సామర్ధ్యం కలిగి, ఇంజనీరింగ్ ప్రతిభకు సాక్ష్యంగా నిలిచిన నిర్మాణాల్లో ఒకటి రాజమండ్రి గోదావరి నదిపై నిర్మించినది కాటన్ బ్యారేజ్. దవళేశ్వరం ఆనకట్టను బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ నిర్మించడంతో దీన్ని కాటన్ బ్యారేజ్ అని పిలుస్తారు. ఉభయగోదావరి జిల్లా ప్రజల ప్రయోజనార్ధం కట్టిన ఈ వంతెనకు మరో రికార్డు కూడా ఉంది. బ్రిటీష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ దీన్ని నిర్మించడంతో ఆయనకు ఇప్పటికి గోదావరి జిల్లాల్లో అపర భగీరథుడిగా చూస్తారు. ఈ వంతెన నిర్మాణం చేపట్టి శతాబ్ధాలు గడిచినప్పటికి ఆయన పేరుతో జయంతి, వర్ధంతి వంటి కార్యక్రమాలను గోదావరి జిల్లా వాసులు రాజమండ్రి కేంద్రంగా నిర్వహిస్తారు. అటువంటి మహానుభావుడు నిర్మించిన బ్రిడ్జీ కారణంగానే గోదావరి జిల్లాల ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు ఇతర అవసరాలకు ఉపయోగపడుతోంది. అయితే నాటి కాలంలో ఈ కాటన్ దొర బ్రిడ్జి నిర్మించేందుకు ఎలాంటి పరికరాలు ఉపయోగించారు..? ఇప్పటికీ ఆ పరికరాలు మనం చూడవచ్చు. అయితే అవి ఎక్కడ ఉన్నాయి..? ఎంత మంది కూలీలు ఈ బ్రిడ్జి నిర్మించారు.. ? కాటన్ బ్రిడ్జి నిర్మాణం వెనుకున్న కష్టాన్ని ఓసారి చూద్దాం.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బ్రిటీష్ కాలంలో నిర్మించిన వంతెనలు, నిర్మాణాలు, చారిత్రక కట్టడాలు ఇప్పటికి చాలా వాడుకంలో ఉన్నాయి. శతబ్ధాలుగా ప్రజల అవసరాలు తీరుస్తున్నాయి. అయితే బ్రిటిష్ నీటిపారుదల ఇంజనీర్ గా పనిచేసిన సర్ ఆర్థర్ కాటన్ (1803–1899) గోదావరి నదిపై ధవళేశ్వరం బ్రిడ్జి నిర్మించేందుకు సాధ్యాసాధ్యలను తెలుసుకున్నారు. భూమి పరిశీలనతో పాటు అక్కడి సామాజిక పరిస్థితులు ప్రజల అవసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రాజమండ్రిలో బ్రిడ్జి నిర్మిస్తే ఆ ప్రాంత రైతులకు జరిగే మేలు గురించి మాత్రమే ఆలోచించారు. దీంతో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు నాటి కాలంలో ప్రారంభించారు. భారీ కట్టడాలు, శిథిలాల తొలగింపు వంటి పనుల కోసం ఏమాత్రం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ రోజుల్లో కాటన్ దొర తన ఇంజనీరింగ్ ప్రతినిభను ప్రదర్శిస్తూ అనేక మిషన్లను తయారు చేయించారు. నాడు కాటన్ బ్రిడ్జి నిర్మాణ సమయంలో వాడిన పరికరాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా రాజమండ్రి కాటన్ మ్యూజియం లోపల భాగంలో మనకి దర్శనమిస్తాయి.
మిల్లర్లు, రాళ్లు పగలగొట్టే మిషన్లు, కూలీలు ఉపయోగించిన పరికరాలతో పాటు రాజమండ్రి గోదావరిపై దవళేశ్వరం బ్రిడ్జి నిర్మించేందుకు ఉపయోగించిన పరికరాలన్నీ ఇప్పటికే చూడవచ్చు. శతాబ్ధాలు గడిచినప్పటికి ఇప్పుడు ప్రజలు ఇంత సౌకర్యంగా ఉండేందుకు నాడు కూలీలు ఇంత కష్టపడ్డారో అర్ధమవుతుంది. అందుకే ఈ భారీ వంతెన నిర్మాణానికి ఆధ్యుడైన సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాలను కూడా రాజమండ్రిలో ప్రతిష్టించారు. వాటిని చూసినప్పుడల్లా రాజమండ్రి వంతెన చరిత్ర గుర్తుకు వస్తూ ఉంటుందని స్థానికులు చెబుతుంటారు.
సర్ ఆర్థర్ విగ్రహాలు కాటన్ మ్యూజియం ప్రాంతంలోనే రెండు ఉంటాయి. రాజసం ఉట్టిపడే విధంగా గుర్రంపై కూర్చున్నట్లుగా కాటన్ దొర విగ్రహాలు కనిపిస్తాయి. రెండు శతాబ్ధాలు గడిచినప్పటికి .. బ్రిటీష్ ఇంజనీర్ అయినా కాటన్ దొరను తమ దేవుడిగా భావిస్తామంటున్నారు గోదావరి జిల్లా ప్రజలు. తాగేందుకు నీళ్లు లేక పంటలకు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న రోజుల్లోనే మహాయజ్ఞాన్ని పూర్తి చేసిన చరిత్రకారుడిగా ఇక్కడి జనం భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Rajahmundry,East Godavari,Andhra Pradesh


