సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల…


గతేడాదితో పోలిస్తే 3 శాతం తగ్గిన ఉత్తీర్ణత
ఈసారి కూడా బాలికలదే పైచేయి

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 2026 సంవత్సరానికి గాను 12వ తరగతి ఫలితాలను బుధవారం విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 85.20గా నమోదైంది. గతేడాది నమోదైన 88.39 శాతంతో పోలిస్తే ఇది సుమారు 3 శాతం తగ్గడం గమనార్హం.ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 17,68,968 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఎప్పటిలాగే, ఈసారి కూడా ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బాలికల ఉత్తీర్ణత శాతం 88.86గా ఉండగా, బాలుర ఉత్తీర్ణత శాతం 82.13గా నమోదైంది. అబ్బాయిల కంటే అమ్మాయిలు 6.73 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు.ప్రాంతాల వారీగా చూస్తే, కేరళలోని తిరువనంతపురం 95.62 శాతం ఉత్తీర్ణతతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ రీజియన్ 72.43 శాతంతో చివరి స్థానంలో ఉంది. ఈసారి సుమారు 1,63,000 మంది విద్యార్థులు కంపార్ట్‌మెంట్ (సప్లిమెంటరీ) కేటగిరీలో ఉన్నారు. ఈ సంఖ్య గతేడాదితో పోలిస్తే 2 శాతానికి పెరిగింది. మరోవైపు, 94,000 మందికి పైగా విద్యార్థులు 90 శాతానికి పైగా మార్కులు సాధించగా, 17,000 మందికి పైగా 95 శాతానికి పైగా స్కోర్ చేశారు.విద్యార్థులు తమ ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. మార్క్‌షీట్లు కూడా అందుబాటులో ఉంచినట్లు బోర్డు తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *