Last Updated:
Chandrababu Naidu Birthday: ఏపీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అయితే అందుకు విభిన్నంగా ఆ జిల్లాలో మాత్రం ముఖ్యమంత్రిపై ఉన్న ప్రేమను కళాకారులు చాటి చెబుతున్నారు.
Chandrababu Naidu Birthday: ఏపీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అయితే అందుకు విభిన్నంగా ఆ జిల్లాలో మాత్రం ముఖ్యమంత్రిపై ఉన్న ప్రేమను కళాకారులు చాటి చెబుతున్నారు. వారికున్న కళను చంద్రబాబుకు చూపించే విధంగా ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ అద్భుతాన్ని చూసిన పలువురు కళాకారుడి మేధస్సుపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కళాకారుడు ఏపీ సీఎం బర్త్ డే సందర్భంగా ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈవీడియో స్టోరీ చూడండి.
దేశ రాజకీయాల్లో ఆయనదో స్పెషల్ ఎడిషన్. భవిష్యత్తుకు తగినట్లుగా విజన్ క్రియేట్ చేసుకొని వనరులు, అభివృద్ది స్కెచ్ వేయడంలో ఆయన రియల్ లీడర్. ప్రజాప్రతినిధులే కాదు అధికారుల్ని కూడా పాలనపరంగా పరుగులు పెట్టించగల సమర్ధవంతమైన సీఎంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు నవ్యాంధ్రప్రదేశ్‌లో కూడా ఆయనకు గొప్ప పేరుంది. అలాంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సోమవారం ఏప్రిల్ 20 కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పలు సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు. చంద్రబాబు బర్త్ డేని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలే కాకుండా, ప్రజల సైతం ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో గోదావరి జిల్లాలో కళాకారులు మాత్రం చంద్రబాబు నాయుడు పై ఉన్న ప్రేమ అభిమానాన్ని కలద్వారా చూపించారు. నిజానికి ఇది ఒక అద్భుతం అంటూ ప్రజలు ఆ కళాకారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన ప్రముఖ కళాకారుడు దేవిని శ్రీనివాస్ తనకున్న కళతో ఎన్నో రూపాలకు ప్రాణం పోస్తుంటారు. అటువంటి శ్రీనివాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగాఒక సబ్బుపై ఆయన రూపాన్ని అందంగా తీర్చిదిద్దారు. నిజానికి చిరునవ్వులు చిలికిస్తూ, చక్కని గడ్డంతో, ఆకట్టుకునే హెయిర్ స్టైల్ తో చంద్రబాబు ఈ సబ్బు రూపంలో అందరిని ఆకట్టుకునే విధంగా ఆ కళాకారుడు ఆ కలను తయారు చేశారని చెప్పుకోవచ్చు. దాదాపుగా 13 గంటల శ్రమించి సబ్బుపై చంద్రబాబు ముఖచిత్రాన్ని అద్భుతంగా చెప్పినట్లు కళాకారుడు దేవిన శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా గోదావరి జిల్లా ప్రజలతో పాటు కళాకారుల తరపున సైతం చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లుగా కళాకారులు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు.
76వ పుట్టినరోజు సందర్భంగా ఏపీలో వాడ వాడల చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా అన్న క్యాంటీన్లో సైతం ప్రత్యేక కార్యక్రమాలు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మురోపక్క ప్రభుత్వ ఆసుపత్రులలో, వసతి గృహాలలో అంతకుమించి వృద్ధ ఆశ్రమాల్లో సైతం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు సందర్భంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
Kakinada,East Godavari,Andhra Pradesh
Apr 20, 2026 10:38 AM IST


