హైదరాబాద్: బాలీవుడ్ ప్రముఖ నటి, మోడల్ దీపికా పదుకొణె బాలివుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తరువాత ఆమె అటు కెరీర్‌ను, ఇటు కుటుంబ జీవితాన్ని సమతూకం చేసుకుంటూ వస్తున్నారు. వీరి జంటకు మొదటి సంతానం ‘దువా’ అనే కూతురు ఉంది. ఇప్ప్పుడు రెండోసారి తల్లి కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఆమె పిల్లల గురించి చేసిన ఆసక్తికర కామెంట్స్ ఇప్ప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తను నటి కాకపోయి ఉంటే ఎలా ఉండేవారో గతంలో పంచుకున్న విషయాలు ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ‘ఒకవేళ నటిని కాకపోయి ఉంటే, ఏం చేసేదాన్నో నాకు తెలియదు. కానీ చుట్టూ పిల్లలతో ఉండి ఉండేదాన్ని. ముగ్గురు చిన్న పిల్లలు నా చుట్టూ అటు, ఇటు పరిగెత్తుతూ ఉంటే చూడాలని ఉంది. ఇప్ప్పుడు కూడా నా పనిని కొనసాగిస్తూనే, పిల్లలను షూటింగ్ సెట్స్‌కు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. కుటుంబంతో ఎప్ప్పుడూ సంతోషంగా గడపడం నాకు ఇష్టం’ అని తెలిపారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరించిన సమయంలోనూ దీపికా పిల్లల గురించి మాట్లాడారు. తనకు చాలామంది పిల్లలు, మనవరాళ్లు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దీపికా పదుకొణె రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ‘కింగ’, ‘రాకా’ సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా ఆమె ప్రకటనతో ఈ రెండు చిత్రాల పరిస్థితిపై ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు. అప్‌డేట్ ఇవ్వాలంటూ చిత్రబృందాన్ని ట్యాగ్ చేస్తున్నారు. షారుక్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘కింగ’ తెరకెక్కుతోంది. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘రాకా’.
The post పిల్లలతో గడపడం తనకు ఎంతో ఇష్టం: దీపికా పదుకొణె appeared first on Visalaandhra.


