సీఎం పదవికి రాజీనామా

అల్పాహార విందులో సిద్ధరామయ్య వెల్లడిబెంగళూరు: కర్ణాటక రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. అనుకున్నట్లుగానే నాయకత్వ మార్పు ఎట్టకేలకు ఖరారైంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ మేరకు తన నివాసంలో గురువారం ఉదయం జరిగిన అల్పాహార విందులో సిద్ధూ తన నిర్ణయాన్ని క్యాబినెట్ మంత్రులకు వివరించారు. తదుపరి సీఎం ఎవరనేదానిపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని సిద్ధరామయ్య చెప్పినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం తర్వాత ఆయన రాజీనామా చేయనున్నారు. అయితే… ప్రస్తుతం కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాత్…

Read More

ఉష్ణోగ్రతల కంటే ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలకు చెమటలు పడుతున్నాయి

ఎండ తీవ్రతపై ప్రధాని మోదీ సూచనలపై .. మల్లికార్జున ఖర్గే చురకబీజేపీ దోపిడీపై మోదీ మాట్లాడటం లేదన్న ఖర్గేఅధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. మంచినీళ్లు బాగా తాగాలని, మధ్యాహ్నం సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, వడదెబ్బ తగిలినట్లుగా భావిస్తే నిర్లక్ష్యం వహించకూడదని జాగ్రత్తలు చెప్పారు. మోదీ జాగ్రత్తలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ప్రజలు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలరని, కానీ బీజేపీ ప్రాయోజిత…

Read More

చామలూరు సచివాలయాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల పరిధిలోని చామలూరు గ్రామ సచివాలయాన్ని గౌరవ జాయింట్ కలెక్టర్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయంలో కొనసాగుతున్న ప్రజా సేవల అమలు తీరును పరిశీలించారు. ముఖ్యంగా బీఎల్వోలు నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, ప్రతి ఇంటి వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలని బీఎల్వోలకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా…

Read More

స్వచ్ఛపథం కార్యక్రమంలో నార్పలలో రహదారి శుభ్రత పనులు….

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం గ్రామపంచాయతీల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛపథం కార్యక్రమంలో భాగంగా స్థానిక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం ప్రత్యేక శుభ్రత కార్యక్రమం చేపట్టారు. నార్పల నుంచి కేశేపల్లి వెళ్లే ప్రధాన రహదారిలో, స్మశాన వాటిక ప్రాంతం సమీపంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. రహదారి ఇరువైపులా పెరిగిన కంపచెట్లు, గడ్డి, మట్టి దిబ్బలను తొలగించి రహదారిని పూర్తిగా శుభ్రం చేశారు. అనంతరం కూతలేరు వంకపై ఉన్న చిన్న…

Read More

అనంతలో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం…

భారీగా 7 కిలోల గంజాయి స్వాధీనం…14 మంది గంజాయి విక్రేతల ముఠా అరెస్ట్విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : భారీగా 7 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని 14 మంది గంజాయి విక్రేతల ముఠా అరెస్ట్ చేసినట్లు బుధవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ పి. జగదీష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వీరిలో ఒక కింగ్ పిన్ సహా ఐదుగురు పాత నేరస్తులు ఉన్నారు… మిగితా 9 మంది గంజాయిని పాకెట్ల…

Read More

ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

విశాలాంధ్ర, యాడికి: యాడికి మండల పరిధిలోని రాయలచెరువు గ్రామంలోని నగరూరు రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అడగయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఆయన తలకు, కాలికి బలమైన గాయాలు అయ్యాయి.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన అడగయ్యను రాయలచెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రభుత్వ వైద్యాధికారి అప్పయ్య ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్ ద్వారా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు…

Read More

గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ.. 8 గొర్రెల మృతి

విశాలాంధ్ర, ఉరవకొండ: ఉరవకొండ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 గొర్రెలు మృతి చెందగా, అనంతరం లారీ డ్రైవర్‌పై గొర్రెల కాపరులు దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.సత్యసాయి జిల్లా రామగిరి గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు గొర్రెల మందను రోడ్డుపై తోలుకుంటూ వస్తుండగా, అనంతపురం నుంచి ఉరవకొండ వైపు టెంకాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 గొర్రెలు అక్కడికక్కడే మృతి…

Read More

బస్సులో ప్రయాణిస్తుండగా వ్యక్తి మృతి..

విశాలాంధ్ర – నల్లచెరువు: తనకల్లు మండలం ఈతోడు గ్రామానికి చెందిన రామ్మోహన్ (40) అనే వ్యక్తి బస్సులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది.స్థానికుల వివరాల మేరకు, రామ్మోహన్ తన తల్లి మరియు మరో బంధువుతో కలిసి తనకల్లు వద్ద మదనపల్లి – కదిరి సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణం ప్రారంభించారు. బస్సు నల్లచెరువు ప్రాంతానికి చేరుకున్న సమయంలో రామ్మోహన్ ఒక్కసారిగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కొద్దిసేపటికే స్పందించకపోవడంతో సహ ప్రయాణికులు, కుటుంబ సభ్యులు…

Read More

పాఠశాలల అక్రమ అడ్మిషన్లు, పుస్తకాల దోపిడీపై డీఈఓ కు వినతి..

ఎస్ఎఫ్ఐ నాయకులువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యా చట్టాలను, ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లు, ముందస్తు ప్రచారాలు నిర్వహిస్తూ, పుస్తకాలు, యూనిఫారాలు, షూస్ పేరుతో తల్లిదండ్రుల నుండి వేలాది రూపాయలు అక్రమంగా పట్టణంలోని పలు పాఠశాలలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రచారాలు నిర్వహించడాన్ని ఖండిస్తూ శ్రీ సత్య సాయి జిల్లా విద్యాశాఖాధికారి DEO కిష్టప్ప న ధర్మవరం పట్టణంలో ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో…

Read More

గొలుసు దొంగతనం..కేసు నమోదు – Visalaandhra

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని పార్థసారధి నగర్ లో కాలింగ్ బెల్ కొట్టి మెడలోని మూడు తులాల బంగారం గొలుసులు గుర్తు తెలియని వ్యక్తి లాక్యలైన సంఘటన ధర్మవరంలో చోటుచేసుకుంది. వివరాలకు వెళితే దంపతులు లక్ష్మీదేవి బాల పెద్దన్న పార్థసారథి నగర్ లో నివాసం ఉంటున్నారు. భర్త వీఆర్వో గా పెనుగొండలో విధులు నిర్వర్తిస్తుండగా, ఉదయం గుర్తుతెలియని వ్యక్తి ఇంటి కాలింగ్ బెల్ మోగడంతో లక్ష్మీదేవి బయటకు రాగా అక్కడే పొంచి ఉన్న దుండగులు ఆమె మెడలోని బంగారాన్ని…

Read More