కృష్ణాతీరంలో అమరావతి ‘ఐ’ – Visalaandhra

. లండన్ తరహాలో ప్రసిద్ధ పర్యాటక ప్రాజెక్టుగా అభివృద్ధి. జులై 1 నుంచి వీబీజీ రామ్‌జీ అమలు. అగ్రిగోల్డ్ కేసులు పరిష్కరించే ప్రత్యేక కోర్టుకు 21 పోస్టులు. కొత్తగా ఏపీ విమానయాన పాలసీ`2026. శ్రీ సిటీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఓ బృహత్తర ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంగ్లాండ్‌లోని ‘లండన్…

Read More

ఐరాసలో జర్మనీకి దెబ్బ

పై చేయి సాధించిన ఆఫ్రికా, కరేబియన్ దేశాలుఐరాస: ఆస్ట్రియా, కిర్గిస్తాన్, పోర్చుగల్, ట్రినిడాడ్టొబాగో, జింబాబ్వే దేశాలకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యÖఎన్‌జీఎస్‌సీ)లో తాత్కాలిక సభ్యత్వం లభించింది. రెండేళ్ల పాటు ఐరాస సభ్యదేశాలుగా ఇవి కొనసాగుతాయి. 193 సభ్య దేశాలుగల ఐరాస భద్రతా మండలి 202728 ఎన్నిక బుధవారం జరిగింది. డెన్మార్క్, గ్రీస్, పాకిస్థాన్, పనామా, సొమాలియా పదవీ కాలం ముగిసింది. వీటి స్థానంలో ఆస్ట్రియా, కిర్గిస్తాన్, పోర్చుగల్, ట్రినిడాడ్టొబాగో, జింబాబ్వే ఎన్నికయ్యాయి. తాత్కాలిక సభ్యదేశాల పదవీ…

Read More

విభజనకు శత్రువుల కుట్ర – Visalaandhra

ముజ్తాబా ఖామేనీ హెచ్చరిక: జాతీయ ఐక్యతకు పిలుపు తెహ్రాన్: యుద్ధ క్షేత్రంలో చిత్తైన శుత్రువులు (అమెరికా`ఇజ్రాయిల్) తమ దేశాన్ని అస్థిరపర్చాలని ప్రయత్నిస్తున్నాయని ఇరాన్ అధినేత అయాతుల్లా ముజ్తాబా ఖామేనీ హెచ్చరించారు. ఇరాన్ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు, వారితో అనుమాన బీజాలు నాటుతున్నట్లు ఆరోపించారు. ఇందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిస్తూ గురువారం ఒక సందేశమిచ్చారు. అనుమానం, భయం, నిరాశ, అపనమ్మకం భావాలు కలిగిస్తూ విభజన లక్ష్యంతో విష బీజాలు నాటి ఇరాన్ ప్రజలను విడదీయాలని…

Read More

యుద్ధం ఆపేయండి

వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధం ముగించాలనే తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తీర్మానానికి 215 అనుకూల.. 208 మంది వ్యతిరేక ఓట్లు వచ్చాయి. నలుగురు రిపబ్లికన్‌లు ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా ఓటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వృథా ఖర్చు ఎందుకని, యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని చట్టసభ్యులు డిమాండ్ చేశారు. ఈ తీర్మానాన్ని విదేశీ వ్యవహారాల కమిటీ సీనియర్ సభ్యుడు, న్యూయార్క్ డెమొక్రటిక్ ప్రతినిధి గ్రెగొరీ…

Read More

బంగారం తెగనమ్ముతున్న మోదీ?

కష్టకాలంలో బంగారం అమ్మడం, కాస్త నాలుగు డబ్బులు వెనకేయగలిగాం అనుకున్నప్పుడు బంగారం కొనడం అన్ని కుటుంబాలూ అనుసరించే విధానమే. కానీ ప్రభుత్వమే బంగారం నిలవలు అమ్మడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిందనడానికి చిహ్నం. దాదాపు రెండు వారాల సమయంలో మే నెలలో భారత ప్రభుత్వం లక్షా 14వేల కోట్ల బంగారం అమ్మి ఉండవచ్చునన్న వార్తలు నిన్నటి నుంచి గుప్పుమంటున్నాయి. బ్లూంబర్గ్ వార్తాసంస్థ ఈ రహస్యం బయటపెట్టింది. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం ఇది…

Read More

దేశ ఆర్థిక స్థిరత్వానికివిదేశీ మారక నిల్వలు కీలకం

ఇస్కా రాజేష్‌బాబువిదేశీ మారక నిల్వలు అంటే ఒక దేశ కేంద్ర బ్యాంకు (మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వద్ద భద్రపరిచే విదేశీ కరెన్సీ, బంగారం అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆస్తుల మొత్తం. ఇవి అంతర్జాతీయ వాణిజ్యానికి, దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకం. విదేశీ మారక నిల్వల భాగాలు భారతదేశ ఫారెక్స్ నిల్వలు ప్రధానంగా అమెరికన్ డాలర్, యూరో, పౌండ్ స్టెర్లింగ్, జపనీస్ యెన్ వంటి ప్రధాన విదేశీ కరెన్సీలు. ఆర్‌బిఐ తన వద్ద నిల్వ…

Read More

యురేనియం నిల్వలు…వైరిపక్షాల బేరసారాలు – Visalaandhra

ఎనిమిది దశాబ్దాల క్రితం జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా లిటిల్ మాన్, ఫాట్ బాయ్ అనే పేర్లతో ప్రయోగించిన అణుబాంబులు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. క్షణాల వ్యవధిలో లక్షలాది ప్రాణాలు గాల్లో కలిసిపోగా, ఆ రెండు పట్టణాలు కనుమరుగై పోయాయి. ఆ రోజు మొదలైన అణ్వస్త్ర భయం నేటికీ ప్రపంచ రాజకీయాలను శాసిస్తూనే ఉంది. దురదృష్టవశాత్తూ, అంతర్జాతీయ రక్షణ రంగంలో ప్రస్తుతం అణ్వాయుధాలు ఒక దేశ సార్వభౌమాధికతకు గీటురాయిగా, మనుగడకు ఆలంబనగా మారిపోయాయి. ఒక దేశం…

Read More

ఎడారిని పంట భూమిగా మార్చిన చైనా

టి. లక్ష్మీనారాయణ ఇటీవల నేను చదివిన అనంతపురం అర్ధ-శుష్క ప్రాంతాలలో భూ క్షీణత, ఇసుక వలసలు, ఎడారీకరణపై శాస్త్రవేత్తల పరిశోధన పత్రం నాకు తీవ్ర ఆందోళన కలిగించింది. బొమ్మనహాల్, బెళుగుప్ప, కణేకల్ మండలాలలో నేల క్షీణత, ఇసుక ఆక్రమణ, హగరి (వేదవతి) నది ఎండిపోవడం వంటి పరిస్థితులు భవిష్యత్తులో వ్యవసాయానికి ముప్పుగా మారవచ్చని పరిశోధకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎడారులను సైతం వ్యవసాయ భూములుగా మార్చిన చైనా అనుభవం మన ఆలోచనలకు పదునుపెట్టాలి. 1990 ఏప్రిల్ 3-9…

Read More

మళ్లీ డీలిమిటేషన్ బిల్లు?

. ప్రాంతీయ పార్టీలతో కేంద్రం రహస్య మంతనాలు. 2029 ఎన్నికల లోపే పూర్తి చేయాలని యోచన. ఏకాభిప్రాయం కోసం ముందస్తు చర్చలు న్యూదిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మరోసారి పార్లమెంటు ముందుకు తెచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. 2029 లోక్‌సభ ఎన్నికల కంటే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి కసరత్తు చేస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఇది సున్నితమైన అంశం కావడంతో ఎలాంటి వివాదాలకు తావులేకుండా రాజకీయంగా ఏకాభిప్రాయం సాధించాలని ప్రభుత్వం యత్నిస్తున్నట్లు…

Read More

అప్పుల బాధ.. మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య

విశాలాంధ్ర – యాడికి: అనంతపురం జిల్లా యాడికి మండలంలోని రాయలచెరువు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, మద్యానికి బానిస కావడంతో ఓ వ్యక్తి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగుచూసింది.పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తలారి కృష్ణయ్య (38) తన భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. రైతుల వద్ద కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని…

Read More