ఇస్కా రాజేష్‌బాబు
విదేశీ మారక నిల్వలు అంటే ఒక దేశ కేంద్ర బ్యాంకు (మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వద్ద భద్రపరిచే విదేశీ కరెన్సీ, బంగారం అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆస్తుల మొత్తం. ఇవి అంతర్జాతీయ వాణిజ్యానికి, దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకం. విదేశీ మారక నిల్వల భాగాలు భారతదేశ ఫారెక్స్ నిల్వలు ప్రధానంగా అమెరికన్ డాలర్, యూరో, పౌండ్ స్టెర్లింగ్, జపనీస్ యెన్ వంటి ప్రధాన విదేశీ కరెన్సీలు. ఆర్బిఐ తన వద్ద నిల్వ ఉంచుకున్న భౌతిక బంగారం. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి సభ్య దేశాలకు కేటాయించే నిల్వ ఆస్తులు. ఐఎంఎఫ్ వద్ద దేశానికి ఉండే కోటా. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ అకస్మాత్తుగా పడిపోకుండా లేదా హెచ్చుతగ్గులకు గురికాకుండా నిరోధించడానికి డాలర్లను విక్రయించడం ద్వారా ఆర్బిఐ జోక్యం చేసుకుంటుంది. ముడిచమురు,అత్యవసరవస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు చెల్లింపులు చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఏదైనా అత్యవసర ఆర్థిక సంక్షోభం లేదా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు బాహ్య రుణాలను తీర్చడానికి ఈ నిల్వలు దేశానికి భరోసానిస్తాయి. భారతదేశ విదేశీ మారక నిల్వలు ఏప్రిల్ 2026లో 551.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి, అంతకుముందు నెలలో ఇవి 552.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మిలియన్ల డాలర్ల డేటా నెల వారీగా నవీకరిస్తారు, ఇది ఏప్రిల్ 1989 నుంచి ఏప్రిల్ 2026 వరకు అందుబాటులో ఉంది. ఈ డేటా సెప్టెంబర్ 2024లో 617.1 బిలియన్ డాలర్ల సర్వకాలిక గరిష్ట స్థాయికి, జూన్ 1991లో 1.1 బిలియన్ డాలర్ల రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలవారీ విదేశీ మారక నిల్వలను డాలర్లలో అందిస్తుంది. తాజా నివేదికల ప్రకారం, అక్టోబర్ 2025 నాటికి భారతదేశ విదేశీ మారక నిల్వలు 7.4 నెలల దిగుమతులకు సమానంగా ఉన్నాయి. మార్చి 2026లో దీని ద్రవ్య సరఫరా ఎం2 గతేడాదితో పోలిస్తే 882.4 బిలియన్ డాలర్లు పెరిగింది. మార్చి 2026 నాటికి భారతదేశ దేశీయ రుణం 3,504.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది గతేడాదితో పోలిస్తే 14.2 శాతం పెరుగుదలను సూచిస్తుంది. గత ఏడాది 2.8 శాతంగా ఉన్న దేశ నిరర్థక రుణాల నిష్పత్తి, 2025 మార్చిలో 2.2 శాతానికి తగ్గింది. భారతదేశ గృహ రుణం మార్చి 2025 నాటికి 17.6 శాతానికి చేరుకుంది, ఇది దేశ నామమాత్రపు జీడీపీలో 17.6 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల మాదిరిగానే భారత్ బంగారాన్ని కీలక రిజర్వ్ ఆస్తిగా కొనసాగిస్తోంది. రిస్క్ మేనేజ్మెంట్, రిజర్వ్ డైవర్సిఫికేషన్, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత లక్ష్యంగా భారత విధానాలు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. బ్లూమ్‌బర్గ్ కథనం నేపథ్యంలో వెలువడిన ఊహాగానాలను కేంద్రం ఖండించడంతో మార్కెట్ వర్గాలు మళ్లీ దేశ ఆర్థిక ప్రాథమిక అంశాలపై దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం భారత్ బంగారం నిల్వలను విక్రయించలేదని, విదేశీ మారక నిల్వలు బలంగానే ఉన్నాయని అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్ తన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి, రూపాయి విలువను నిలబెట్టేందుకు బంగారం నిల్వలను విక్రయించిందంటూ వెలువడిన వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్ కథనం నేపథ్యంలో మార్కెట్లో చర్చకు దారితీసిన ఈ అంశంపై అధికార వర్గాలు స్పష్టత ఇచ్చాయి. దేశ బంగారం నిల్వలను విక్రయించలేదని, అలాంటి వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నాయి. బ్లూమ్‌బర్గ్ ప్రచురించిన కథనంలో భారత్ ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో తన విదేశీ మారక నిల్వలకు మద్దతుగా కొంత బంగారాన్ని విక్రయించి ఉండొచ్చని సూచించడంతో మార్కెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. దీంతో పెట్టుబడిదారులు, ఆర్థిక విశ్లేషకులు, వ్యాపారవర్గాలు భారత ఆర్థిక స్థితిగతులపై ప్రశ్నలు లేవనెత్తాయి. అధికారిక వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేశాయి. విదేశీ మారక నిల్వలను రక్షించేందుకు లేదా రూపాయి విలువను నిలబెట్టేందుకు బంగారం విక్రయించిన దాఖలాలు లేవని స్పష్టంచేశాయి. భారత రిజర్వ్ నిర్వహణ వ్యవస్థ బలంగా ఉందని, ప్రపంచస్థాయి ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొనే సామర్థ్యం దేశానికి ఉందని పేర్కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, అమెరికా వడ్డీ రేట్లపై అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి కారణాలతో కేంద్ర బ్యాంకుల రిజర్వ్ వ్యూహాలపై దృష్టి పెరిగింది. ఈ క్రమంలో బంగారం నిల్వల తరలింపు, రిజర్వుల పునర్వ్యవస్థీకరణ లేదా అకౌంటింగ్ మార్పులను కొందరు తప్పుగా అర్థం చేసుకుని విక్రయాలుగా భావించి ఉండొచ్చని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. అధికారికంగా ధృవీకరించని వార్తల ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవద్దని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం స్థిరమైన వృద్ధి, ఎగుమతులు, విదేశాల నుంచి వచ్చే నగదు ప్రవాహాలు, బలమైన బ్యాంకింగ్ వ్యవస్థతో ముందుకు సాగుతోందని చెబుతున్నారు. విదేశీ మారక నిల్వలు దేశానికి బలమైన రక్షణ కవచంలా పనిచేస్తున్నాయని పేర్కొంటున్నారు. అవసరమైతే రూపాయి విలువలో హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు ఆర్బిఐ వద్ద విధానపరమైన సాధనాలు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. కొన్ని వారాలుగా ఒత్తిడిని ఎదుర్కొన్న భారత విదేశీ మారక నిల్వలు మళ్లీ భారీ పెరిగాయి. మే 8తో ముగిసిన వారానికి దేశ విదేశీ మారక నిల్వలు 6.295 బిలియన్ డాలర్లు పెరిగి 696.988 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజా గణాంకాల్లో వెల్లడించింది. అంతకుముందు వారంలో విదేశీ మారక నిల్వలు 7.794 బిలియన్ డాలర్లు తగ్గి 690.693 బిలియన్ డాలర్ల వద్ద నమోదయ్యాయి. ఫిబ్రవరి 27తో ముగిసిన వారంలో భారత్ విదేశీ మారక నిల్వలు చరిత్రాత్మక గరిష్ఠ స్థాయి అయిన 728.494 బిలియన్ డాలర్లను తాకాయి.అయితే పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు ప్రారంభమైన తర్వాత ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. దీని ప్రభావం రూపాయిపై కూడా పడటంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి ఏర్పడింది. సెల్ : 96520 39780


