46 ఏళ్ల తర్వాత ధవళేశ్వరం బ్యారేజీకి పూర్తి స్థాయిలో అప్‌గ్రేడేషన్
రూ.124 కోట్లతో ఆధునికీకరణ పనులు! గోదావరి డెల్టా జిల్లాల జీవనాడి, చారిత్రాత్మక ధవళేశ్వరం బ్యారేజీ (సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ) ఆధునికీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బ్రిటీష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఈ ఐకానిక్ నిర్మాణానికి దాదాపు 46 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు పూర్తి స్థాయిలో అప్‌గ్రేడ్ లభించబోతోంది. బ్యారేజీ భద్రతను పెంచడం, నీటి నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా గోదావరి డెల్టా పరిధిలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడమే ఈ…


