AP Tourism | పర్యాటకులకు గుడ్ న్యూస్.. ర్యాపిడో డ్రైవర్లే ఇక టూరిస్ట్ గైడ్స్!



ఏపీ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక ముందడుగు వేసింది. ఏపీ పర్యాటక సంస్థ ఏపీటీడీసీ(aptdc) , రాపిడో సంస్థ సంయుక్తంగా దేశంలోనే మొదటిసారిగా డ్రైవర్ కం గైడ్ అందుబాటులో తీసుకొచ్చింది. ఇతర రాష్ట్రాలు , ఇతర ప్రాంతాల నుండి విశాఖ వచ్చిన వారికి రైల్వే స్టేషన్ , ఏర్పోర్ట్ , బస్ స్టేషన్ నుండి నేరుగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సరికొత్త డ్రైవర్ కం గైడ్ కార్యక్రమం తీసుకువచ్చింది. పర్యాటకులు కోరిన ప్రదేశాలకి తీసుకెళ్లి ఆ ప్రాంత చరిత్రను తెలిపే విధంగా ఈ రాపిడో డ్రైవర్లను తయారు చేస్తుంది. డ్రైవర్ కం టూరిస్ట్ గైడ్ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో రాపిడో డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇది మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. #aptourism #rapidodrivers #TouristGuide



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *