మే 3 నుంచి 6వ తేదీ వరకూ.. ఏపీ, తెలంగాణ, యానాం, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా చెల్లాచెదురుగా కురుస్తాయి అని IMD తెలిపింది. ఐతే.. వర్షాలతోపాటూ.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయని తెలిపింది. ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని అంచనా వేసింది. కోస్తాంధ్ర, యానాంలో మే 3న పిడుగులు పడతాయనీ, గాలి వేగం గంటకు 70 కిలోమీటర్లకు కూడా చేరగలదని IMD తెలిపింది.



