ఇవాళ వానలతోపాటూ.. ఎండలూ ఎక్కువగానే ఉంటాయి. తెలంగాణలో ఉష్ణోగ్రత 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. నల్గొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఖమ్మం, గద్వాల ప్రాంతాల్లో ఎండ ఎక్కువగా ఉంటుంది. ఏపీలో ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఒంగోలు నుంచి తిరుపతి వరకూ, హిందూపురం నుంచి కర్నూలు వరకూ అంతటా వేడి ఎక్కువగానే ఉంటుంది. కొన్ని ప్రాంతాలు మధ్యాహ్నం తర్వాత వర్షాన్ని చూస్తాయి. ఏపీలో తేమ 39 శాతంగా, తెలంగాణలో 28 శాతంగా ఉంటుంది.



