Road Accident: అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం.. హైవేపై బోల్తా పడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 12 మంది ఘోరంగా.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్ కాలువలో బోల్తా, 36 మందిలో పలువురికి తీవ్ర గాయాలు, 12 మందికి స్వల్ప గాయాలు, డ్రైవర్ నిద్రమత్తే కారణమని అనుమానం

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..! బస్సు బోల్తా 12 మందికి గాయాలు
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..! బస్సు బోల్తా 12 మందికి గాయాలు

అనకాపల్లి జిల్లాలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గాఢ నిద్రలో అప్పుడే మేల్కొంటున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై అదుపుతప్పి ప్రైవేటు ట్రావెల్ బస్ కాలువలో బోల్తా పడింది. బస్సు ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో కొంతమందికి తీవ్రగాయాలు అవ్వగా, 12 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు బయటకు తీసి హాస్పిటల్ కి తరలించారు. చెన్నై నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్ర మత్తు కారణంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక సమాచారం. జాతీయ రహదారిపై బస్సు బోల్తాపడడంతో కొంత సమయం వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న నక్కపల్లి పోలీసులు జాతీయ రహదారిపై ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ప్రయాణికులు చాలా మంది ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *