ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, యానాంలో ఏప్రిల్ 28, 29 అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. వర్షాలతోపాటూ.. మెరుపులు, పిడుగులు కూడా పడతాయని హెచ్చరించింది. అలాగే ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని IMD అంచనా వేసింది. ఇవే పరిస్థితులు తెలంగాణలో ఏప్రిల్ 26 నుంచి 29 వరకూ ఉంటాయి. కర్ణాటక, కేరళలో కూడా వర్షాలు, వడగళ్లు పడతాయని IMD తెలిపింది.



