Tirupati: పోలీసుల్ని చూసి భయంతో కారు యాక్సిడెంట్.. వెహికల్‌లో డ్రైవర్‌తో పాటు ఆమె ఉందట |


Last Updated:

Tirupati: టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతి నగరంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో లీలా మహల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉంచిన ఒక ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

+

Tirupati

Tirupati

Tirupati: టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతి నగరంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో లీలా మహల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉంచిన ఒక ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. స్థానికులు, పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం ఓ హిజ్రా మహిళతో కలిసి ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ మార్గమధ్యంలో పోలీసులను గమనించి భయానికి గురయ్యాడు. అదే సమయంలో పోలీసుల కంట పడకుండా ఉండాలనే ప్రయత్నంలో ఆటోని ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది.

అర్ధరాత్రి యాక్సిడెంట్..

తిరుపతిలో అర్ధరాత్రి కారు డ్రైవర్ చేసిన యాక్సిడెంట్‌తో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కేవలం పోలీసులు ఉన్నారనే ఆ ఆందోళనలో కారు స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి కారు డ్రైవర్ కారణమైనట్లుగా తెలుస్తోంది. అంతే కాదు ప్రమాదం జరిగిన సమయంలో కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని ప్రాథమిక సమాచారం సూచిస్తోంది. అదే సమయంలో రోడ్డు పక్కన ఆటోను ఆపి నిద్రిస్తున్న ఆటో డ్రైవర్‌పై ఈ కారు బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగం తీవ్రంగా ఉండడంతో ఆటో , కారు రెండూ రోడ్డుకు పక్కన ఉన్న సుమారు పది అడుగుల లోతులోకి పడిపోయాయి.

కారు డ్రైవర్ భయంతో..

ఈ దృశ్యం అక్కడి స్థానికులను కలవరపరిచింది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఇరు వాహనాల డ్రైవర్లు స్వల్ప గాయాలతోనే ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కారు డ్రైవర్‌పై డ్రంక్ అండ్ డ్రైవర్, రాష్ డ్రైవింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఎవరైనా భక్తులు, స్థానికులు ఉండి ఉంటే ప్రాణనష్టం జరిగేదని అంటున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *