Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. మే 1 నుంచి ఆ దర్శనాలు రద్దు.. సామాన్య భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్! |


br naidubr naidu

సాధారణ రోజుల కంటే వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. గత మూడేళ్ల గణంకాలను పరిశీలించిన టీటీడీ యంత్రాంగం, ఈ ఏడాది మే, జూన్, జూలై నెలల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. రోజుకు సరాసరి లక్ష మందికి పైగా భక్తులు కొండపైకి వస్తున్నా, ప్రస్తుతం 75 వేల మందికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతోంది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయించాలని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈఓ ముద్దాడ రవిచంద్ర నిర్ణయించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *