Last Updated:
Temple Controversy: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అన్నదాన సత్ర సమీపంలో చనిపోయిన గోవు మృతదేహాన్ని 24 గంటలు తొలగించకపోవడంతో దుర్వాసన, భక్తుల ఆగ్రహం, అధికారులపై నిర్లక్ష్య ఆరోపణలు
ఒకపక్క గోదావరి, మరోపక్క సముద్రం ఉన్న సమీప ప్రాంతంలో, నవ నరసింహా క్షేత్రమైన ఒక దివ్య క్షేత్రం వెలిసి ఉంది. అలాంటి ప్రాంతంలో అపచారం చోటుచేసుకుంది అంటూ భక్తులు మండిపడుతున్నారు, స్థానిక పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం, మరోపక్క పట్టించుకోని దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు అంటూ చెప్పకొస్తున్నారు..
ఇదే క్షేత్రంలో గోపూజలు చేస్తూ గోవును లక్ష్మీదేవిగా కొలుస్తూ ఉంటారు, కానీ అదే ప్రాంతంలో గోవుకు అంత దారుణమైన అవమానమా అంటూ ప్రజలకు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఆ దివ్యక్షేత్రం ఎక్కడ ఉంది? అసలు అక్కడ ఏం జరిగింది? ఒకసారి క్లుప్తంగా చూద్దాం
నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటైన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రం అది, ఒక పక్క గోదావరి మరోపక్క సముద్రం, ఇక ఆ సమీప మధ్య ప్రాంతంలో ఉండేదే లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రం అని చెప్పుకోవచ్చు. నిత్యం అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రం కలకలలాడుతూ కనిపిస్తూ ఉంటుంది.
అలాంటి దివ్య క్షేత్రం అన్నదాన సత్ర సమీపంలో హిందువులు లక్ష్మీదేవిగా భావించే గోవు 24 గంటల కిందట ప్రాణం విడిచింది. అయితే జరిగిన వెంటనే కాదు జరిగి ఒకరోజు దాటినప్పటికీ, ఆ గోవును అక్కడ నుంచి తరలించి కుండా అక్కడే వదిలేయడంతో భక్తులు సగటు ప్రజలు మండిపడుతున్నారు, ఈ నిర్లక్ష్యం ఒక అంతర్వేది లక్ష్మీనరసింహ దేవస్థానం అధికారులదే కాదు, స్థానిక పంచాయతీ అధికారులకు అంటూ స్థానికులు చెప్పుకొస్తున్నారు..
గోవు మరణించి 24 గంటలు దాటడంతో దాని కళేబారం కుళ్ళిపోవడంతో దుర్వాసన సైతం క్షేత్ర ప్రాంగణంలో వ్యాపించింది. దీంతో భక్తులు స్థానికులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు హిందువులంతా గోవును లక్ష్మీదేవిగా పూజిస్తూ ఉంటే, అలాంటి లక్ష్మీదేవి కొలువైన నరసింహుడి క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన ఏంటి మహాప్రభో అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా హిందువులు భక్తులు మనోభావాలు దెబ్బ తినకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ ప్రజల కోరుతున్నారు. ముందు చనిపోయిన గోవు మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించి శుభ్రం చేయించాలని స్థానికుల పేర్కొంటున్నారు .
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana


