Sumangali Vratham: సుమంగళి వ్రతం చేయడానికి ఎవరు అర్హులు.. వ్రత విధానం, ఫలితం ఇలా ఉంటుందట | ఆస్ట్రాలజీ


Last Updated:

Sumangali Vratham: స్త్రీల దాంపత్య సౌఖ్యం, ఆయురారోగ్యాలు, సంతాన సాఫల్యం కోసం సుమంగళి వ్రతం అత్యంత ప్రభావవంతమైందని ప్రముఖ వేద పండితులు పలఖండం సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు.ఈ వ్రతం ఆచరించడం ద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి, దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుందని తెలిపారు. మరి ఈ వ్రతం ఎప్పుడు..? ఎవరు ? ఎలా ? చేయాలో తెలుసుకోండి.

+

Sumangali

Sumangali Vratham

Sumangali Vratham: స్త్రీల దాంపత్య సౌఖ్యం, ఆయురారోగ్యాలు, సంతాన సాఫల్యం కోసం సుమంగళి వ్రతం అత్యంత ప్రభావవంతమైందని ప్రముఖ వేద పండితులు పలఖండం సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. పరమేశ్వరుడు అమ్మవారికి ఈ వ్రత మహిమను వివరిస్తూ, దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే సుమంగళి వ్రతాన్ని ఆచరించాల్సిన అవసరం ఉందని శాస్త్రాల్లో పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వ్రతం ఆచరించడం ద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి, దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుందని తెలిపారు.

ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని, ముఖ్యంగా జాతకంలో కుజదోషం, సప్తమ స్థానంలో రాహువు, కుజుడు లేదా శని ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుందని ఆయన వివరించారు. ఇలాంటి గ్రహస్థితుల కారణంగా వివాహం ఆలస్యమవడం, అనుకూలమైన జీవిత భాగస్వామి దొరకకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని, అయితే సుమంగళి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే కోరుకున్న భర్త లభించే అవకాశం పెరుగుతుందని తెలిపారు.

అలాగే ద్వితీయ, పంచమ స్థానాల్లో కుజుడు లేదా రాహువు ఉన్నవారికి సంతాన సంబంధిత ఆటంకాలు ఏర్పడే అవకాశముందని చెప్పారు. అటువంటి సంతానలేమి దోషాలను నివారించడానికి ఈ వ్రతం ఎంతో ఉపకరిస్తుందని, సుమంగళి వ్రతం ద్వారా నర్వసౌభాగ్యాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు.

ఈ వ్రత ప్రాముఖ్యతను లలితా సహస్రనామంలో అనేకసార్లు ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు. కాబట్టి లలితాదేవి, గాయత్రి అమ్మవారు లేదా లక్ష్మీదేవి చిత్రపటాన్ని ప్రతిష్టించి భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించడం శ్రేయస్కరమని సూచించారు. ప్రత్యేకంగా స్త్రీలు ప్రతిరోజూ ఇంట్లో మహాలక్ష్మి దీపం వెలిగించడం ఆనవాయితీగా కొనసాగుతుందని, దీపారాధనతో పాటు నైవేద్యం సమర్పించి లలితా సహస్రనామార్చన చేస్తే సుమంగళి వ్రత ఫలితమే లభిస్తుందని వివరించారు.

సుమంగళి వ్రతం అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక ఆచారం అని పేర్కొంటూ, వివాహం ఆలస్యమవుతున్న వారు, దాంపత్య జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు, సంతానం కోరుకునే దంపతులు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. భక్తి, నమ్మకం, నియమ నిష్ఠలతో ఈ వ్రతాన్ని నిర్వహిస్తే స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయని ఆయన స్పష్టం చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

పంచాంగం, రాశులు, దినఫలాలు, వారఫలాలు, న్యూమరాలజీ, వాస్తు టిప్స్, ఆలయాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ధార్మిక సంబంధమైన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆస్ట్రాలజీ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *