వచ్చే 4, 5 రోజులుతీవ్ర వడగాడ్పులు


ఐఎండీ వెల్లడి
న్యూదిల్లీ: దేశంలో ఇప్పటికే ఎండలు మండిపోతుండగా… రానున్న నాలుగైదు రోజుల పాటు దేశంలోని వాయువ్య, మధ్య, తూర్పు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ముఖ్యంగా ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 25 మధ్య వివిధ తేదీల్లో హర్యానా, చండీగఢ్, దిల్లీ, పంజాబ్, తూర్పు రాజస్థాన్, విదర్భ, చత్తీస్‌గఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్, గంగానది పరివా హక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 20-26 మధ్య గంగా పరివాహక పశ్చిమ బెంగాల;్ ఏప్రిల్ 20-22 మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల;్ ఏప్రిల్ 20-24 మధ్య కేరళ, మాహే, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, యానాం; ఏప్రిల్ 24, 25 తేదీల్లో గుజరాత్ తీర ప్రాంతాల్లో ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం ఉండే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.
రాత్రి వేళల్లో అధిక ఉష్ణోగ్రతలు
ఏప్రిల్ 20, 21 తేదీల్లో హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లోనూ, ఏప్రిల్ 20న చత్తీస్‌గఢ్, ఏప్రిల్ 20-22 మధ్య ఒడిశాలో రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని ఐఎండీ వెల్లడించింది.

The post వచ్చే 4, 5 రోజులుతీవ్ర వడగాడ్పులు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *