School Adoption: ఆ గురుకుల పాఠశాలకు కొత్త కళ.. విద్యార్థుల భవిష్యత్తు మార్చబోతున్న MEIL సంస్థ.. | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

School Adoption: రామకుప్పం బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఎం.ఇ.ఐ.ఎల్ దత్తత తీసుకుంది, సిఎస్ ఆర్ ద్వారా ఆధునిక వసతులు, విద్యార్థుల ప్రవర్తన మార్పుపై దృష్టి, అధికారులు హర్షం

రామకుప్పం గురుకుల పాఠశాలను దత్తత తీసుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ<br><br>
రామకుప్పం గురుకుల పాఠశాలను దత్తత తీసుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ

రామకుప్పం మండలంలోని బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల అభివృద్ధికి నూతన అధ్యాయం మొదలైంది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) ఈ పాఠశాలను దత్తత తీసుకుని, అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చింది.

ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ (IAS), మెగా ఇంజనీరింగ్ ప్రతినిధి M.G.V.K. భాను  (Rtd. IAS), చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు , KADA ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ (IAS), ప్రభుత్వ విప్, MLC కంచర్ల శ్రీకాంత్, APSRTC వైస్ చైర్మన్ P.S. ముని రత్నం, PKM UDA చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు హాజరై చర్చించుకున్నారు.ఈ సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి M.G.V.K. భాను మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

“మేము కేవలం CSR నిధుల ద్వారా భవనాలను నిర్మించి లేదా నిధులను ఇచ్చి వదిలేయడం లేదు. మా ప్రధాన లక్ష్యం నిధుల ఖర్చు మాత్రమే కాదు, ఇక్కడ చదువుకునే విద్యార్థుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం. వారి ఆలోచనా దృక్పథాన్ని మార్చి, క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం ద్వారానే దీర్ఘకాలిక అభివృద్ధి సాధ్యమవుతుంది. విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా వారిని మానసికంగా సిద్ధం చేస్తాం” అని ఆయన పేర్కొన్నారు.

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి రోజే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు. కేవలం మౌలిక సదుపాయాలే కాకుండా, విద్యార్థుల సమగ్ర వికాసం కోసం మెగా సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అధికారులు, నాయకులు తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *