Road Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొని నలుగురు మహిళా కూలీలు మృతి! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

Road Accident: కాకినాడ రూరల్ కొవ్వూరు జాతీయ రహదారిపై టిప్పర్ లారీ ఢీకొని నలుగురు ఉపాధి హామీ మహిళలు మృతి, ఇద్దరు తీవ్రంగా గాయపడి జిజిహెచ్ లో చికిత్స, పోలీసులు దర్యాప్తు ప్రారంభం

+

News18

News18

ఏపీలో శనివారం ఉదయం భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రశాంతతకు మారుపేరు అయిన కాకినాడ రూరల్ కొవ్వూరు జాతియ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది . ఈ ప్రమాదంలో నలుగురు ఉపాధి హామీ కూలీలు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలు పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉపాధి హామీ కూలీలు రోడ్డు దాటుతూ ఉండగా టిప్పర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు, పోలీసులు తెలియజేశారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.

కాకినాడ జిల్లా రూరల్ ప్రాంతానికి సంబంధించి కొవ్వూరు రహదారిపై శనివారం ఉదయం ఉపాధి హామీ కూలీలు రోడ్డు దాటుతూ ఉండగా, టిప్పర్ లారీ వేగంగా వచ్చి వీరిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఉపాధి హామీ కూలీలైన వాసంశెట్టి సత్యవతి, పాలిక కృష్ణవేణి, కాదా చిట్టెమ్మ, చెల్లూరి అన్నవరం మృత్యువాత పడ్డారు.

అదేవిధంగా ఇదే ప్రమాదంలో బాలిక నాగమణి, మట్టపర్తి అరుణలు తీవ్ర గాయాలు పాలై కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, ఏది ఏమైనా నలుగురు మహిళలు చనిపోవడం మరో ఇద్దరు తీవ్ర గాయాలు పాలు కావడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.

పొట్టకూటి కోసం వస్తే ప్రాణాల మీదకే వచ్చాయంటూ బాధిత కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. ఉదయం సమయంలో తీసే ఫోటోలు కోసం రావడం జరిగిందని, ఇలాంటి తరుణంలో రోడ్డు దాటుతూ ఉండగా ఇష్టారాజ్యంగా వచ్చిన లారీ ఢీ కొట్టిందంటూ తోటి ఉపాధి హామీ మహిళలు పేర్కొంటున్నారు, ఘటన ప్రాంతానికి కాకినాడ రూరల్ పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కాకినాడ జిజిహెచ్ తరలించగా, గాయపడిన వారిని సైతం జిజిహెచ్ కు తరలించారు. ప్రస్తుతం గాయపడిన ఇద్దరు కోలుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది.

ప్రమాదంలో ఎవరిది తప్పుఅభం శుభం తెలియని మహిళలను ఢీకొట్టిన టిప్పర్ లారీ దా తప్పు, లేక అక్కడ ఏం జరిగింది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. కేవలం పొట్టకూటి కోసం పనులు కోసం వచ్చిన వారిని లారీ పొట్టన పెట్టుకుందంటూ బాధిత మహిళల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు, ఈ విషాదకర ఘటనతో శనివారం కాకినాడ జిల్లా వ్యాప్తంగా విషాదఛాయలు ఉన్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *