నేటి సమాజంలో యోగ ప్రాముఖ్యత అత్యంత అధికం


యోగా మాస్టర్స్ దాసరి రామన్న, చార గుండ్ల నరేష్, ప్రభాకర్
విశాలాంధ్ర ధర్మవరం;; నేటి సమాజంలో యోగా ప్రాముఖ్యత అధికంగా ఉందని ప్రతి మనిషి యోగాను అభ్యసించుకోవాలని యోగా మాస్టర్ దాసరి రామన్న, చారగుండ్ల నరేష్, ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని శివానగర్ మున్సిపల్ హైస్కూల్లో శివ సాయి యోగ సెంటర్లో వేసవి కాలంలో ఉచిత యోగ సమ్మర్ క్యాంపును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ తరగతులు మే 31వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. శిక్షణ ముగిసిన తర్వాత ప్రభుత్వం ద్వారా సర్టిఫికెట్లను పంపిణీ చేస్తామని తెలిపారు. ఉదయము సాయంత్రం వేళల్లో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, దీనికి విశేష స్పందన రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్త చేశారు. నిష్ణాతులైన యోగా మాస్టర్ల చేత సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతోనే ఉచిత యోగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసు నుంచి ముసలి వయసు వరకు కూడా ఈ యోగా తమ ఆరోగ్యమును పదిలంగా ఉంచుతుందని తెలిపారు. ఈ శిక్షణ తరగతులలో ముఖ్యంగా ధ్యానము ప్రాణాయామము సూర్య నమస్కారాలు నేర్పించడమే కాకుండా కుటుంబం పట్ల గౌరవము, సామాజిక విలువలు, పెద్దలపట్ల వారి ప్రవర్తన తీరు మొదలగు అంశాలపై కూడా శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం పట్టణములో ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాజ్యోతిలోని సాంస్కృతిక మండలి లో, శివానగర్లోని మున్సిపల్ హైస్కూల్లో, ఆర్టీసీ బస్టాండ్ యశోద కిడ్స్ కాన్సెప్ట్ స్కూల్లో మే 1వ తేదీ నుంచి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమం శ్రీ సత్య సాయి జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వర్ రెడ్డి, సాంస్కృతిక మండలి అధ్యక్షులు సత్రశాల ప్రసన్నకుమార్, కార్యదర్శి సోలిగాళ్ళ వెంకటేశులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *