Pawan Kalyan: మెగా అభిమానిని మర్చిపోని పవన్ కళ్యాణ్‌.. ఠాగూర్ కుటుంబానికి ఉద్యోగం, ఆర్థిక సహాయం! Pawan Kalyan fan support. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

జనసేన అధినేత Pawan Kalyan ఆదేశాలతో MP Tangella Uday Srinivas దారకొండ వెంకటరమణ ఠాగూర్ కుటుంబానికి ఆర్థిక సహాయం, యువతికి ఉద్యోగం హామీ ఇచ్చారు

News18
News18

ఎట్టకేలకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం Pawan Kalyanకు అభిమాని దారకొండ వెంకటరమణ కుటుంబానికి పార్టీ నుంచి అండ లభించింది. పార్టీ కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన ఆ అభిమానిని మరవబోమంటూ జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు.. ఇంట్లోని యువతికి ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు కాకినాడ ఎంపీ Tangella Uday Srinivas వెల్లడించారు. ఆదివారం రాత్రి ఆయన స్వయంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు.

కాకినాడ జిల్లా కొలిమేరు గ్రామానికి చెందిన దారకొండ వెంకటరమణ అలియాస్ ఠాగూర్.. మెగాస్టార్ Chiranjeevi, పవన్ కళ్యాణ్‌లకు వీరాభిమాని. చిరంజీవి సీఎం అయితేనే పెళ్లి చేసుకుంటానని జీవితాంతం వివాహానికి దూరంగా ఉండిపోయాడంటే అతని అభిమాన స్థాయి ఏంటో అర్థమవుతుంది. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత గ్రామాల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఠాగూర్ ఎంతో చురుకుగా పనిచేశాడని స్థానికులు చెబుతున్నారు. పార్టీ జెండా భుజాన వేసుకుని ప్రతి కార్యక్రమంలో ముందుండే వ్యక్తిగా ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

అయితే అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో.. పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారి చూసి చనిపోతా అని ఠాగూర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తల దృష్టికి వెళ్లగా.. అభిమానిని కలిసేలోపే నాలుగు రోజుల వ్యవధిలో ఠాగూర్ తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటనతో జనసేన శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. అభిమానిని కోల్పోయామంటూ సోషల్ మీడియాలో పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

మొదటగా జనసైనికులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి పార్టీ కండువా కప్పి లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్పందించి.. ఆ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉండాలని నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ స్వయంగా గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఠాగూర్ తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా.. కుటుంబ పరిస్థితిని దగ్గరగా తెలుసుకుని వారికి భరోసా ఇచ్చారు.

ఇక మృతుడు సోదరుడు వికలాంగుడు కావడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దయనీయంగా మారినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఠాగూర్ కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. పార్టీ కోసం ఠాగూర్ ఎంత కష్టపడ్డాడో.. ఇప్పుడు అతని కుటుంబం కోసం జనసేన అంతే బాధ్యతగా నిలుస్తుంది అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా ఆర్థిక సహాయం అందజేశారు.

ఒక అభిమాని తన జీవితాన్నే పార్టీకి అంకితం చేస్తే.. ఆ కుటుంబాన్ని మరవకుండా అండగా నిలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అభిమానిని మర్చిపోలేదు, జనసేన తన కార్యకర్తల్ని గౌరవిస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఠాగూర్ కుటుంబానికి పార్టీ ప్రకటించిన సహాయం వార్త రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *