సాయికృష్ణది లాకప్ డెత్ అని సిట్ నిర్ధారణ..
కృష్ణలంక సీఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు కీలక మలుపు తీసుకుంది. ఇది అదృశ్యం కేసు కాదని, పోలీసు కస్టడీలో జరిగిన మరణం (లాకప్ డెత్) అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుకు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సిట్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను…


