Today Top 10 News: యుద్ధం ఇంకా ముగియలేదు.. ఉక్రెయిన్‌లో రోబో సైనికులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు


బీఆర్ఎస్‌లో చేరిన జీవన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రా నాయకులకు తొత్తుగా మారి సీమాంధ్ర ప్రభావంలో ఉన్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసు నుంచి పోలవరం వరకు ఆయనపై విమర్శలు చేస్తూ, రాజ్యాంగానికి గౌరవం లేదన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని, రేవంత్ సీఎం కావడం కూడా కేసీఆర్ చేసిన పుణ్యం వల్లేనని అన్నారు.

————————-

2.మావోయిస్టుల్లా బీఆర్ఎస్ కనుమరుగవుతుంది

బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీ కూడా నక్సలైట్లలా కనుమరుగవుతుందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో అవినీతి జరిగిందని, కవితను అప్రూవర్‌గా మార్చి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పైకి వేరైనా వాస్తవానికి ఒకటేనని, కేసీఆర్–రేవంత్ ఒకరినొకరు కాపాడుకుంటున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగించి ప్రభుత్వం నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు.

——————-

3.కేసీఆర్ పిల్లి శాపనార్థాలకు భయపడం: పొన్నం

మంత్రి పొన్నం ప్రభాకర్, కేసీఆర్. జీవన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ప్రతిపక్షం కేవలం విమర్శలు కాకుండా సలహాలు ఇవ్వాలని అన్నారు. ప్రజలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ప్రభుత్వం కూలిపోతుందంటూ కేసీఆర్ పెడుతున్న ‘పిల్లి శాపనార్థాలకు’ భయపడేది లేదని, మరో 10 ఏళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెసే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ ఇచ్చిన గౌరవానికి ప్రతిఫలం ఏమిటో ప్రశ్నిస్తూ, అవమానం జరిగిందన్న వాదనను ఖండించారు. ఆర్థిక సమస్యలున్నా హామీలు అమలు చేస్తున్నామని చెప్పి, ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని కోరారు.

————

4. విజయ్ ఎలా రాణిస్తాడో చెప్పలేం -చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తమిళనాడులోని చెన్నైలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు, మీడియాతో మాట్లాడుతూ నటుడు విజయ్ స్థాపించిన కొత్త పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’పై స్పందించారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఎలా రాణిస్తారో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ఇది కొత్త పార్టీ కావడంతో దాని గురించి తాను ఎక్కువగా వ్యాఖ్యానించలేనని తెలిపారు. ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు. అయితే విజయ్ విజయావకాశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

—————

5. మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. ఖర్గే వివరణ

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెన్నైలో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అన్నాడీఎంకే-బీజేపీ పొత్తును ప్రశ్నిస్తూ మోదీపై విమర్శలు చేయడంతో భాజపా క్షమాపణలు చెప్పాలనొ కోరింది. ఖర్గే వ్యాఖ్యలు అవమానకరమని పేర్కొంటూ స్టాలిన్‌తో పాటు ఆయన కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. దీనిపై ఖర్గే స్పందిస్తూ తాను మోదీని ఉగ్రవాది అనలేదని, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాత్రమే అన్నానని స్పష్టం చేశారు.

———————

6. ఉదయనిధి అఫిడవిట్‌లో లెక్కల తారుమారు

తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఎన్నికల అఫిడవిట్లలో ఆస్తులు, పెట్టుబడులు, రుణాల గణాంకాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని ఐటీ శాఖ మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. 2021, 2026 అఫిడవిట్ల మధ్య రెడ్ జెయింట్ మూవీస్ పెట్టుబడులు మరియు బ్యాంకు రుణాల వివరాల్లో తేడాలు ఉన్నాయని పేర్కొంది.

కంపెనీ రికార్డుల ప్రకారం రుణం రూ.18 కోట్లు ఉండగా, అఫిడవిట్లలో భిన్నంగా చూపినట్టు ఐటీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై పిటిషన్ ఆధారంగా విచారణ కొనసాగుతుండగా, తిరిగి ఐటీఆర్ ఫైల్ చేయాలని సూచించింది.

————————————–

7. సినిమాకు అడ్డంకులు వస్తాయని విజయ్‌కి ముందే తెలుసు

టీవీకే అధినేత విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్, ‘జననాయగన్’ సినిమా విడుదల ఆలస్యం మరియు లీక్‌పై స్పందించారు. ఈ చిత్రానికి అడ్డంకులు వస్తాయని విజయ్ ముందే ఊహించాడని, సెన్సార్ జాప్యం, లీక్ విషయాలు తమకు ఆశ్చర్యం కలిగించలేదని చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్తే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని విజయ్ ముందే నిర్మాతను హెచ్చరించినట్లు తెలిపారు. ఇవి రాజకీయ ప్రత్యర్థుల కారణంగా జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. కుటుంబమా? ప్రజలా? అంటే విజయ్‌ ఓటు ప్రజలకే వేస్తరని అన్నారు చంద్రశేఖర్.

————————–

8. ట్రంప్‌‌తో తరుణ్‌ భాస్కర్ చాయ్‌ పే చర్చ..!?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయంతో యువకుడి జీవితం మారే కథాంశంతో రూపొందిన ‘గాయపడిన సింహం’ చిత్రం మే 1న థియేటర్లలో విడుదల కానుంది.

ఏప్రిల్ 30న విదేశాల్లో విడుదల అవుతుంది, అయితే ఇరాన్‌లో మాత్రం రిలీజ్ కావడం లేదు. ఈ విషయాన్ని సరదాగా చూపిస్తూ టీమ్ ఒక ఫన్నీ ఏఐ వీడియోను పంచుకుంది. ట్రంప్‌కు టీ ఇచ్చిన తరుణ్‌ భాస్కర్‌ ఇది ఇండియన్‌ టీ కాదు, ఇరాన్‌ టీ అని చెప్పడం ఇందులో ఆకట్టుకునే అంశం. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా నటించారు.

——————————

9. ఉక్రెయిన్‌లో రోబో సైనికులు

ఉక్రెయిన్ యుద్ధరంగంలో సైనికుల ప్రాణాలకు ప్రమాదం తగ్గించేందుకు రోబో సైనికులను వినియోగిస్తోంది. ఇవి సురక్షిత ప్రాంతాల నుంచి ఆపరేటర్ల ద్వారా నియంత్రించబడుతున్నాయి. భూతల రోబోలు, డ్రోన్ల సహాయంతో తొలిసారిగా శత్రు శిబిరంపై దాడి చేసి బందీలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఈ రోబో వ్యవస్థలను సరఫరా, రక్షణతో పాటు ఇప్పుడు దాడులకూ ఉపయోగిస్తున్నారు.

———————–

10.యుద్ధం ఇంకా ముగియలేదు -నెతన్యాహు

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇరాన్ అణు కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసే వరకు విడిచిపెట్టేది లేదని ఆయన సంకేతాలిచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *