డ్రోన్ నిఘాతో జూద స్థావరంపై పోలీసుల దాడి..ముగ్గురు అరెస్ట్.. నగదు స్వాధీనం


విశాలాంధ్ర, చిలమత్తూరు..జూదం, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ పర్యవేక్షణలో హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్ ఆధ్వర్యంలో చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతలపల్లి గ్రామ శివారులో జూద స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు.చిలమత్తూరు ఎస్సై శ్రీధర్ పోలీసు సిబ్బందితో కలిసి డ్రోన్ సర్వైలెన్స్ సహాయంతో నిర్వహించిన ఈ దాడిలో జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.అయితే పోలీసుల రాకను గమనించిన మరో వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. పరారీలో ఉన్న వ్యక్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.అరెస్టు చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు సీఐ జనార్ధన్ వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, జూదం, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *