గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ పథకం కింద కేవలం రూ. 10,000 మాత్రమే ఆర్థిక సాయంగా అందేది. అయితే, గత ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు ఈ మొత్తాన్ని రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఈ ఆర్థిక సాయాన్ని రూ. 20,000లకు పెంచి, వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు పెద్ద ఊరట కల్పించింది. పెరిగిన ధరలు, అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.



