టీమిండియా చేతిలో ఓటమిపై పాక్ మాజీల ఆగ్రహం
ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైన పాకిస్థాన్ జట్టు, జట్టు మేనేజ్‌మెంట్‌పై ఆ దేశానికి మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం కొలంబోలో జరిగిన టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీనిపై షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ… నాకే అధికారం ఉంటే బాబర్, షాబాద్, షాహీన్‌ను జట్టులోకి తీసుకోనని స్పష్టం చేశాడు. వారికి ఇప్పటికే చాలా అవకాశాలు వచ్చినప్పటికీ వరుసగా విఫలమవుతున్నారన్నాడు. పాక్…


