తెలంగాణ భవన్‌ వద్ద హైటెన్షన్‌.. పోలీసుల అదుపులో హరీశ్‌ రావు

గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పుల అంశాలపై చర్చించేందుకు గన్‌పార్క్‌కు బయల్దేరిన బీఆర్ఎస్‌ నేత హరీశ్‌రావును తెలంగాణ భవన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని ముందుకు వెళ్లనివ్వలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్‌ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చర్చకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు. వాహనాన్ని నిలిపివేయడంతో హరీశ్‌రావు కాలినడకన గన్‌పార్క్‌కు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో హరీశ్‌రావు కిందపడిపోయారు. అనంతరం…

Read More

భర్త హత్య కేసులో భార్య అరెస్ట్

విశాలాంధ్ర – యాడికి: యాడికి మండల పరిధిలోని పెద్దపేట గ్రామంలో ఈ నెల 12న జరిగిన పల్లా శివప్రసాద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితురాలైన అతని భార్య పల్లా హేమావతి (35)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీనివాసులు సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. పల్లా శివప్రసాద్ మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా తరచూ భార్య హేమావతిని వేధించేవాడని చెప్పారు. ఈ క్రమంలో ఈ…

Read More

Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్లపై తీపి కబురు చెప్పిన సీఎం.. అలా చేసిన వారికి రూ. 2,400లు..

Free Gas Cylinder: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ‘దీపం’ (Deepam) పథకం లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు ఒక తీపి కబురు చెప్పారు. Source link

Read More

Sariya Waterfalls: సరియా వాటర్‌ఫాల్ బ్యూటిఫుల్ లొకేషన్.. ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీతో వెళ్లినా ఆ కిక్కే వేరు

Sariya Waterfalls: సమ్మర్ వచ్చేసింది. స్కూల్స్, కాలేజీ స్టూడెంట్స్‌కి ఎగ్జామ్స్ పూర్తి కావడంతో సమ్మర్ హాలిడేస్‌కి మంచి టూరిస్ట్‌ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా అయితే మీరు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఓ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్‌ని విజిట్ చేయవచ్చు. దాని పేరే సరియా జలపాతం. దీనికి బాహుబలి జలపాతం అనే మరోపేరు కూడా ఉంది. Source link

Read More

ఎల్‌డీఎఫ్‌ను అదశ్య హస్తం నిర్ధేశిస్తోంది: రాహుల్ గాంధీ

అలప్ప్పుళ: కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానంగా ఎల్‌డీఎఫ్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు. ఎల్‌డీఎఫ్, బీజేపీలపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘ఎల్‌డీఎఫ్‌ను ఒక అదృశ్య హస్తం పథనిర్దేశం చేస్తోంది. ఆ అదృశ్య హస్తానిది భారత రాజ్యాంగాన్ని అంగీకరించని మతత్వం. ప్రజల్ని విభజించి విద్వేషాలను రెచ్చగొట్టడం దాని నైజం’ అని రాహుల్ పరోక్షంగా ఎల్‌డీఎఫ్, బీజేపీల మధ్య అనుబంధం ఉందని చెప్పారు. దేశంలోని ఇతర ప్రదేశాల్లో మైనారిటీలపై దాడులకు పాల్పడే శక్తులతో కేరళ ముఖ్యమంత్రి, ఎల్‌డీఎఫ్…

Read More

కరువును జయించే వరి.. చైనా శాస్త్రవేత్తల కీలక ఆవిష్కరణ

ప్రపంచ జనాభాలో సుమారు సగం మంది ప్రజలకు వరి ప్రధాన ఆహార వనరు. అయితే వరి సాగుకు అధిక పరిమాణంలో నీరు అవసరమవుతుంది.ప్రస్తుతం వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాతం అస్థిరంగా మారడం వల్ల వరి దిగుబడులు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేయగలిగే, కరువు పరిస్థితులను తట్టుకునే వరి రకాలను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో చైనా శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన విజయాన్ని నమోదు చేశారు….

Read More

ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలి – Visalaandhra

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న న్యూదిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు చాలా ప్రధానమైనవి. ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం కీలకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న అన్నారు. పట్నాలో చాణక్య న్యాయ విశ్వవిద్యాలయంలో రాజేంద్రప్రసాద్ స్మారక ఉపన్యాసం ఇస్తూ… ఎన్నికల సమగ్రతను కాపాడే ప్రాథమిక బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టంచేశారు. ఎన్నికలు నిర్వహించే వారు పోటీ చేసే వ్యక్తులపై ఆధారపడితే మొత్తం ప్రక్రియ తటస్థతపై అనుమానాలు వ్యక్తమవుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని…

Read More

భారత్‌కు నేపాల్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు

న్యూదిల్లీ: భారత్‌కు నేపాల్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది. దీనికి కారణం…జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపుతూ ఉన్న తన నెట్‌వర్క్ మ్యాప్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేయడమే. దీనిపై నెట్టింట భారత్ నుంచి తీవ్ర విమర్శలు రావడంతో నష్టనివారణ చర్యలకు దిగింది. బుధవారం ఎయిర్‌లైన్స్ తన సోషల్ మీడియాలో ఒక మ్యాప్‌ను పంచుకుంది. అందులో కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు పాక్ భూభాగంలో భాగంగా చూపించింది. ఈ పోస్టు తెగ వైరల్ అవగా…భారత నెటిజన్ల నుంచి విమర్శలు వెళ్లువెత్తాయి….

Read More

రోటరీ క్లబ్ నూతన కమిటీ – Visalaandhra

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సాంస్కృతిక మండలి లో నూతన రోటరీ క్లబ్ కమిటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇన్స్టిలేషన్ ఆఫీసర్ కేశవరెడ్డి, ఇన్నర్ వీల్ క్లబ్ శ్వేతా రెడ్డి పాల్గొన్నారు. వీరి ఆధ్వర్యంలో నూతన కమిటీ అయిన అధ్యక్షులు బి. జయసింహ, కార్యదర్శి ఎం. చంద్రశేఖర్, కోశాధికారి కె పెద్దారెడ్డి చేత ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరెడ్డి మాట్లాడుతూ ధర్మవరంలో ఇప్పటికే రోటరీ క్లబ్ కు మంచి గుర్తింపు ఉందని, ఆ…

Read More

శ్రీసత్యదేవ నర్సరీ సందర్శించిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

విశాలాంధ్ర – కడియం : కూటమి ప్రభుత్వం నర్సరీ రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. కడియం మండలం కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీని శుక్రవారం ఆయన సందర్శించారు. ఆయనకి సత్యదేవ నర్సరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లా పెద్దసత్యనారాయణ, సప్తగిరి నర్సరీ రైతు కుప్పాల దుర్గారావు లు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మామిడి మొక్కతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నర్సరీరంగం పర్యాటకంగా మరింత…

Read More