Last Updated:
Mobile Phones Recovery: చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు రూ.1 కోటి 20 వేల విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
Mobile Phones Recovery: చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు రూ.1 కోటి 20 వేల విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఈ కార్యక్రమంలో పాల్గొని ఫోన్లను బాధితులకు అందించారు. మారుతున్న జీవన విధానంలో సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయరాని భాగమైందని, అలాంటి ఫోన్లు పోగొట్టుకున్నప్పుడు ప్రజలు పడే ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా మొదటి సమాచారం నివేదిక నమోదు చేయకుండానే ఇంటి వద్ద నుంచే కేంద్ర పరికర గుర్తింపు నమోదు వ్యవస్థ సేవల ద్వారా పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి పొందవచ్చని చెప్పారు.
రాష్ట్రంలో, జిల్లాలో పెద్ద ఎత్తున చోరీ కాబడిన సెల్‌ఫోన్లను చిత్తూరు జిల్లా పోలీసులు రికరీ చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు రూ.1 కోటి 20 వేల విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 14వ దశలో 501 ఫోన్లు స్వాధీనం చేయగా, ఇప్పటివరకు మొత్తం 14 దశల్లో రూ.9 కోట్లు 55 లక్షల 40 వేల విలువైన 4607 సెల్ ఫోన్లను పోలీసులు తిరిగి పొందారు. ఇతర రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ప్రాంతాల నుండి కూడా ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేయడం విశేషమన్నారు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ.
చిత్తూరుకు రాలేని బాధితులకు తపాలా ద్వారా ఫోన్లు పంపే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. ఇంకా మిగిలిన ఫోన్లను త్వరలోనే స్వాధీనం చేసుకుని అందజేస్తామని తెలిపారు. సెల్ ఫోన్లు కోల్పోయిన వారు కేంద్ర పరికర గుర్తింపు నమోదు వ్యవస్థ సేవలను వినియోగించుకోవాలని, అవసరమైతే 9440900004 నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేసి పరికర గుర్తింపు సంఖ్యను నిరోధం చేయించుకుంటే, ఆ ఫోన్ దేశవ్యాప్తంగా ఉపయోగించలేనిదిగా మారుతుందని, తద్వారా ట్రాకింగ్ సులభమవుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్రైమ్ ఇన్స్పెక్టర్ ఉమా మహేశ్వరరావుతో పాటు సాంకేతిక సిబ్బంది బాపూజీ, రఘురామన్ కీలక పాత్ర పోషించినట్లు ఎస్పీ అభినందించారు. సెల్ ఫోన్లు తిరిగి అందుకోవడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ సర్వీసు అయిన CEIR Portal (https://www.ceir.gov.in) ద్వారా మొబైల్ ఫోన్ కోల్పోయిన లేదా దొంగిలించబడిన పక్షంలో ప్రజలు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలని తెలియజేశారు.ఫిర్యాదు చేసి IMEI నంబర్‌ను బ్లాక్ చేయించుకుంటే, ఆ మొబైల్ దేశవ్యాప్తంగా ఉపయోగించలేరు మరియు పోలీసులకు ట్రాకింగ్ సులభమవుతుంది. ఫిర్యాదు కోసం IMEI నంబర్, మొబైల్ వివరాలు మరియు వ్యక్తిగత వివరాలు సరిపోతాయన్నారు.ఫోన్ తిరిగి లభించిన పక్షంలో అదే పోర్టల్ ద్వారా అన్‌బ్లాక్ చేయించుకోవచ్చు. ప్రజలు ఆలస్యం చేయకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని చిత్తూరు జిల్లా పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Chittoor,Andhra Pradesh
Apr 23, 2026 10:58 AM IST


