May Flowers Garden: అందరిని ఆకర్షిస్తున్న మే ఫ్లవర్స్.. ఈ ఒక్క నెల మాత్రమే కనిపిస్తాయి తెలుసా | ట్రెండింగ్


Last Updated:

May Flowers Garden: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గున్నేపల్లి గ్రామంలో రిటైర్డ్ ఉద్యోగి గంటి సత్యనారాయణమూర్తి నివాసంలో అధిక సంఖ్యలో ఈ మే పుష్పాలు కనిపిస్తున్నాయి.

+

May

May Flowers

May Flowers Garden: ఎండాకాలం అందులో మాఘమాసం వచ్చిందంటే చాలు మే మాసంలో మాత్రమే వికసించే ఆ పుష్పాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆ పుష్పాలను మే మాసం పుష్పాలుగా ఏపీలో పిలుస్తూ ఉంటారు. చాలా అరుదుగా ఈ పుష్పాలు కనిపిస్తాయి. ఒకేచోట కేవలం ఒకటి రెండు అంతకుమించి మూడు కనిపిస్తే అద్భుతమే. కానీ వీటన్నిటికీ మించి ఏకంగా ఒక రిటైర్డ్ ఉద్యోగి నివాసంలో అధిక సంఖ్యలో మే పుష్పలే దర్శనమిచ్చాయి. వాళ్ల గార్డెన్లో ఈ మే పుష్పాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గున్నేపల్లి గ్రామంలో కనువిందు చేస్తున్న మే పుష్పాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది లోకల్18.

ఒక్క నెలలో పూచే పూలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయగోదావరి జిల్లాతో పాటు కడియం వంటి ప్రాంతాల్లో పూల మొక్కలు, నర్సిరీలు, అనేక రకాల పూల మొక్కలు కనిపిస్తాయి. అయితే శీతాకాలం, వర్షాకాలం కాకుండా ఇప్పుడున్న వేసవి కాలంలో అంటే కేవలం మే నెలలో మాత్రమే ఒకరమైన పూలు పూస్తాయి. అలాంటి పుష్పాలు తాజాగా కాకినాడ జిల్లాలోని సంబంధించి లోవ కొండల్లో కేవలం మూడు పుష్పాలు కనిపించాయి. అయితే ఇలా ఒకటి రెండు కాకుండా అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గున్నేపల్లి గ్రామంలో రిటైర్డ్ ఉద్యోగి గంటి సత్యనారాయణమూర్తి నివాసంలో అధిక సంఖ్యలో ఈ మే పుష్పాలు కనిపిస్తున్నాయి. రిటైర్డ్ ఉద్యోగి ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టగానే ఈ లైట్ పింక్ కలర్ ఫ్లవర్స్ అందరిని కంట పడి భలే ముచ్చటగా అనిపిస్తున్నాయి. ఒకటో రెండో కాదు కనీసం వెయ్యి పుష్పల వరకు ఈ టీచర్ దంపతుల ఇంటి ఆవరణలో ఉండటంతో మీడియాతో పాటు గ్రామస్తులు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఎర్రని రంగులో ఉండి బంతుల్లా కనిపించే ఈ పుష్పాలు అందరికి తెగ నచ్చేస్తున్నాయి.

మే పుష్పాలతో స్పెషల్ గార్డెన్..

మే పుష్పాలు ఒకటి రెండు కనిపిస్తేనే అద్భుతంగా చూస్తారు. అలాంటిది ఒకే చోట సుమారు 1000 పుష్పాలు నర్సరీలా గార్డెన్‌ను పోలినట్లుగా ఉండటంతో అందరి చూపు ఈ పూలపైనే పడింది. కేవలం ఒక్క మాసంలో మాత్రమే విరబూసే ఈ మే పుష్పాలు మిగిలిన 11 నెలలు మచ్చుకైనా కనిపించవని అంటున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వాటిని కంటికి రెప్పలా కాపాడిన రిటైర్డ్ ఉపాధ్యాయ దంపతులను సైతం పలువురు అభినందిస్తున్నారు. చాలా మంది ప్రకృతి ప్రేమికులు, స్థానికులు, పరిచయస్తులు వారి ఇంటికి వెళ్లి ఆ పువ్వుల మధ్య ఫోటోలు తీసుకుంటూ ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు.మే మాసం ముగిస్తే కనీసం పువ్వులకు సంబంధించి మొగ్గలు  కూడా ఉండవని చెప్పుకోవచ్చు . అయితే ఉన్న కాడలను జాగ్రత్తగా కాపాడుకుంటూ,వస్తూ వాటికి నీళ్లు వేస్తే కేవలం మే మాసంలో మాత్రమే పువ్వులు పూస్తూ ఉంటాయి. మిగిలిన 11 నెలలు కనీసం మొగ్గల జాడ కూడా ఉండదు.

ఇల్లే పూల వనం..

అయితే ఈ ఏడాది ఏపీలో రికార్డ్ స్థాయిలో ఈ రిటైర్డ్ ఉద్యోగి సత్యనారాయణమూర్తి నివాసంలో మాత్రం కనువిందు చేస్తున్నాయి. ఈ మే ఫ్లవర్స్ గార్డెన్ గురించి ఆ నోట ఈ నోట ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున నివాసానికి చేరుకుని సరదా సరదాగా మే ఫ్లవర్స్ వీడియోలు కూడా తీస్తున్నారు. ఇలాంటి అరుదైన పుష్పాలను మీరు కూడా చూడాలని అనుకుంటే గోదావరి జిల్లాలకు సంబంధించి ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామానికి వెళితే సరదాగా చూసేవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *