Interstate Crime Gang Arrested | అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. |


Last Updated: Apr 15, 2026, 16:36 IST

చిత్తూరు జిల్లా ,పలమనేరు నియోజకవర్గం,పలమనేరు పోలీస్స్టేషన్లో డి.ఎస్.పి డేగల ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించి కీలక విషయాలు వెల్లడించారు. వి.కోట మండలం మరియు పరిసర ప్రాంతాల్లో వరుసగా తాళాలు వేసిన ఇళ్ళు, దేవాలయాలు, మోటార్ సైకిళ్ళు మరియు పొట్టేళ్ళ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను వి.కోట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ IPS ఆదేశాల మేరకు, వి.కోట సీఐ సోమశేఖర్ రెడ్డి మరియుసిబ్బందితో కూడిన రెండు ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి.నాయకనేరి చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, KA 05 ML 2774 నంబరు గల టయోటా ఇతియోస్ కారులో తప్పించుకోవడానికి ప్రయత్నించిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
#Theft #InterstateGang #Robbery



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *