Last Updated:
Heatwave Warning: ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు నమోదు అవుతున్నాయి. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత ప్రభావం చూపుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Heatwave Warning: ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత ప్రభావం చూపుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని, అలాగే 262 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు.
బుధవారం (15-04-26) రాయలసీమ,కోస్తా జిల్లాల్లో 42-44°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం 4, విజయనగరం 19, పార్వతీపురంమన్యం 14, అల్లూరి సీతారామరాజు 1, పోలవరం 4, అనకాపల్లి 2, కాకినాడ 1, తూర్పుగోదావరి 1 మండలాల్లో(46) తీవ్రవడగాలులు, 73 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 2, విజయనగరం 4, పోలవరం 7, అనకాపల్లి 4, కాకినాడ 5, తూర్పుగోదావరి 13, ఏలూరు 7, ఎన్టీఆర్ 3, గుంటూరు 1, పల్నాడు 16, మార్కాపురం 4, ప్రకాశం 1, నెల్లూరు2, కడప 2, తిరుపతి 2 మండలాల్లో(73) వడగాలులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మంగళవారం కడప(జి) ఒంటిమిట్టలో 45°C, కర్నూలు(జి) లద్దగిరి, నంద్యాల(జి) సంజామల 44. 2°C, తిరుపతి(జి) వరదయ్యపాలెంలో 43.8°C, మార్కాపురం(జి) అనుమలపల్లిలో 43°C, నెల్లూరు(జి) కొమ్మిపాడులో 43°C, అనంతపురం(జి) రాయదుర్గంలో 42.8°C, పల్నాడు(జి) దుర్గిలో 42.8°C,శ్రీసత్యసాయి(జి) తలుపులలో 42.8°C, అన్నమయ్య(జి) కంభంవారిపల్లెలో 42.6°C, ప్రకాశం(జి) కొప్పరపాడులో 42°C,కృష్ణా(జి) కంకిపాడులో41.1°C, చిత్తూరు(జి) నగరిలో 41 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అనారోగ్య బారిన పడకుండా శీతల పానీయాలు సేవించాలని తెలిపారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జాగ్రత్తలు వహించాలని అన్నారు.
Visakhapatnam,Andhra Pradesh



