Last Updated:
Heatwave: ఏపీలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నేటి నుంచి అనగా ఈనెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆయే జిల్లాలలో బానుడు ప్రతాపం అత్యధికంగా ఉంటుందని వాతావరణ శాఖతో పాటు ఆజిల్లా కలెక్టర్లు స్వయంగా ప్రకటించారు. ప్రతి మండలంలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ తెలియజేశారు.
Heatwave: ఏపీలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నేటి నుంచి అనగా ఈనెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆయే జిల్లాలలో బానుడు ప్రతాపం అత్యధికంగా ఉంటుందని వాతావరణ శాఖతో పాటు ఆజిల్లా కలెక్టర్లు స్వయంగా ప్రకటించారు. ప్రతి మండలంలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ తెలియజేశారు. దీంతో ఈ వారం రోజులు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా ఉండాలని ఆ జిల్లా కలెక్టర్ స్వయంగా ఒక ప్రకటన ద్వారా ప్రజలకు వివరించారు, నిజానికి అంతలా ఉష్ణోగ్రతలు ఏ జిల్లాలో నమోదు అవుతాయి? అధికారులు ఏం చెబుతున్నారు.
ఏపీకి సంబంధించి కాకినాడ జిల్లాలో ఈ నెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రికార్డ్ స్థాయిలో ఎండలు మండిపోతాయని జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేందర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రతి మండలంలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందని స్పష్టంగా తెలిపారు. ఇలాంటి తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా వృద్ధులు చిన్నారులు జాగ్రత్తలు వహించాలంటూ కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో వచ్చే వారం రోజులపాటు 41° సెంటీగ్రేడ్ మించి ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిందని జిల్లా కలెక్టర్ ప్రసాద్ తెలిపారు. కావున అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల దుష్ప్రభాల నుండి రక్షణకు ప్రజలు అప్రమత్తతో జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. వేడిగాడ్పులు వీచే అవకాశం దృష్ట్యా వడదెబ్బ నుండి రక్షణ పొందేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండ వేళల్లో సాద్యమైనంత వరకూ ఆరు బయట సంచరించ వద్దని, బయటకి వెళ్లవలసినపుడు వదులుగా ఉండే తేలికపాటి, లేతరంగు కాటన్ దుస్తులు ధరించాలని, అలాగే టోపీలు, తలపాగలు, చలువ కళ్లజోళ్లు, గొడుగులు వాడాలని సూచించారు.
డిహైడ్రేషన్ కు గురికాకుండా నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీరు, మజ్జిగ, ఓఅర్ఎస్ వంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. వాంతులు, విపరీతమైన అలసట, కండరాల తిమ్మిరి, అధిక హృదయ స్పందన రేటు, ముదురు రంగులో మూత్రం రావడం వంటివడదెబ్బ సూచనలు కలిగితే వెంటనే నీడలో లేదా చల్లటి ప్రదేశంలో పడుకోవాలని, తడి గుడ్డతో శరీరాన్ని తుడుస్తూ, చల్లని నీరు లేదా ఓ.ఆర్.ఎస్ (ORS) తాగించాలని, పరిస్థితి విషమిస్తే వెంటనే సమీప ఆసుపత్రికి తరలిచి వైద్యులను సంప్రదించాలని తెలిపారు. ఏది ఏమైనా మే మాసం అంటేనే బానుడు ప్రతాపం అత్యధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఏడాది ఊహించిన విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Kakinada,East Godavari,Andhra Pradesh


