Last Updated:
Extra Marital Affair : వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు పెట్టుకునే కొందరికి మూడు ముళ్ల బంధం ముళ్ల కంచెగా మారుతోంది. జీవితాంతం కలిసి ఉంటానని భర్తతో వేసిన ఏడు అడుగులు, పెళ్లి నాటి ప్రమాణాలను ఇట్టే మర్చిపోతున్నారు కొందరు వివాహిత మహిళలు. తమ శారీరక సుఖం,వ్యామోహంతో ఏర్పడిన పరిచయాలను చూసి మురిసిపోతున్నారు.
Extra Marital Affair : వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు పెట్టుకునే కొందరికి మూడు ముళ్ల బంధం ముళ్ల కంచెగా మారుతోంది. జీవితాంతం కలిసి ఉంటానని భర్తతో వేసిన ఏడు అడుగులు, పెళ్లి నాటి ప్రమాణాలను ఇట్టే మర్చిపోతున్నారు కొందరు వివాహిత మహిళలు. తమ శారీరక సుఖం,వ్యామోహంతో ఏర్పడిన పరిచయాలను చూసి మురిసిపోతున్నారు. అక్రమ సంబంధం ముసుగులో కట్టుకున్న భర్త పెద్ద అడ్డుగా ఉన్నాడనే భావనతో వదిలించుకునేందుకు కిరాతకాలు, దారుణాలకు పాల్పడుతున్నారు. చివరకు డబ్బులు ఇచ్చి ప్రియుడితోనే భర్తకు హత్య చేయించే స్థాయికి ఎదిగిపోయారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో శిల్పారెడ్డి అనే వివాహిత తన భర్తను చంపమని ప్రియుడికి లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఓ సుపారీ గ్యాంగ్‌తో మర్డర్ స్కెచ్ వేసింది. శిల్పారెడ్డి కథ వర్కవుట్ కాకపోవడంతో భర్త సుపారీ గ్యాంగ్ నుంచి ప్రాణాలతో బయటపడి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దురాగతం బయటపడింది.
కడప జిల్లా ప్రొద్దుటూరులో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను శాశ్వతంగా వదిలించుకునే ప్రయత్నం చేసింది ఓ వివాహిత. ప్రియుడికి డబ్బులు ఇచ్చి మరీ ఓ సుపారీ గ్యాంగ్‌తో మర్డర్ చేయించాలనుకుంది. లింగాపురంకి చెందిన ఈశ్వర్‌రెడ్డికి శిల్పారెడ్డితో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్దలు రావడంతో పదే పదే ఇంట్లో గొడవపడుతూ ఉండేవారు. ఈక్రమంలోనే శిల్పారెడ్డికి ప్రొద్దుటూరులోని ఆసుపత్రిలో పని చేస్తున్న నాగ సుధీర్‌తో పరిచయం ఏర్పడింది. నాగ సుధీర్ కూడా వివాహితుడే కావడంతో వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. అయితే నాగ సుధీర్ అనే వ్యక్తితో తన భార్య శిల్పారెడ్డి వివాహేతరసంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఆమె భర్త ఈశ్వర్ రెడ్డి పద్దతి మార్చుకోమని.. అతడ్ని కలవడానికి వీల్లేదని పలుమార్లు మందలించాడు. ఈవిషయంలో భర్త మాట పెద్దగా పట్టించుకోకపోవడంతో శిల్పారెడ్డి, ఈశ్వర్ రెడ్డి తరచూ గొడవపడుతూ ఉండేవారు.
హాయిగా ప్రియుడితో తాత్కాలిక ఆనందం పొందుతున్న శిల్పారెడ్డి భర్త మందలింపును టార్చర్‌గా భావించింది. తమ రిలేషన్‌షిప్‌కి ఈశ్వర్ రెడ్డి అడ్డుగా ఉన్నాడని భావించి హిందూపురంకి చెందిన ఓ సుపారీ ముఠాకు 10 లక్షలు ఇచ్చి భర్తను చంపించాలని ప్రియుడికి చెప్పింది. ఇందుకోసం తన 14 తులాల బంగారాన్ని ఇచ్చింది. నాగ సుధీర్ వినయ్ అనే రౌడీషీటర్‌కి ఈ మర్డర్ డీల్ కోసం 10 లక్షలు ఇస్తానని చెప్పి ముందుగా రూ. 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. పని పూర్తైన తర్వాత అంటే (శిల్పారెడ్డి భర్త ఈశ్వర్ రెడ్డిని చంపిన) మిగిలిన అమౌంట్ ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నారు. ఈ డబ్బును అరేంజ్ చేయడం కోసం నాగ సుధీర్ శిల్పారెడ్డి ఇచ్చిన 14 తులాల బంగారు నగల్ని వేర్వేరు షాపుల్లో విక్రయించి డబ్బులు రౌడీషీటర్ వినయ్‌కి ఇచ్చాడు.
భర్తను చంపించేందుకు సుపారీ ఇవ్వడమే కాకుండా శిల్పారెడ్డి తన భర్త ఎప్పుడు ఎలా వెళ్తున్నాడో.. ఎక్కడ చంపాలో డైరెక్షన్ ఇస్తూ వచ్చింది. శిల్పారెడ్డి ఇచ్చిన సలహాలు, సూచనలతోనే సుపారీ గ్యాంగ్ ఈశ్వర్‌రెడ్డిని ఫాలో అయ్యారు. పలుమార్లు అతడ్ని చంపడంలో విఫలమయ్యారు. చివరగా బుధవారం బైకుపై వెళ్తుంటే కారుతో ఢీకొట్టి చంపాలని ప్లాన్ ఇచ్చింది. కిందపడగానే కత్తులతో పొడిచి చంపేయమని చెప్పింది. శిల్పారెడ్డి మర్డర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఈశ్వర్ రెడ్డి తప్పించుకొని పారిపోయాడు. వెంటనే పోలీసులకు విషయం చెప్పడంతో శిల్పారెడ్డి ఆమె ప్రియుడు నాగ సుధీర్‌ని అరెస్ట్ చేశారు. సుపారీ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు.
Kadapa (Cuddapah),Y.S.R.,Andhra Pradesh
Apr 24, 2026 12:23 PM IST



