సుప్రీంకోర్టులో మల్లారెడ్డికి దక్కని ఊరట
సుప్రీంకోర్టులో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలకు చుక్కెదురైంది. జీడిమెట్ల భూ సర్వేకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు.మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని జీడిమెట్ల సర్వే నం. 82/1/ఈఈలో గల 0.33 గుంటల భూమికి హద్దులు నిర్ణయించాలని కోరుతూ శేరి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తొలుత హైకోర్టును ఆశ్రయించారు. తన భూమికి వెళ్లే దారిని మూసివేశారని,…


