బాధితులకు పోగొట్టుకున్న డబ్బులు అందజేత…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా):- మండల పరిధిలోని కేశేపల్లి గ్రామం సమీపంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద రోడ్డుపై లక్ష్మీనరసింహులు అనే విద్యార్థికి మార్చి 31 న డబ్బులు దొరికాయి.వీటిని విద్యార్థి ఉపాధ్యాయుడు శాంత్ ప్రకాష్ రెడ్డికి అందజేశారు. సమస్యను నార్పల ఎస్సై సాగర్ దృష్టికి తీసుకెళ్లడంతో, పోలీసులు పూర్తి విచారణ నిర్వహించారు. బాధితుడు జుల కాల్వ గ్రామానికి చెందిన రవీంద్రకు గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్సై చేతుల మీదుగా 49000 రూపాయలు అప్పగించారు. నిజాయితీతో…

Read More

ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం స్థాపన – Visalaandhra

సీఎం నారా చంద్రబాబు నాయుడు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన కళ్యాణ వేదిక శ్రీరాముడు, శ్రీవారి అనుగ్రహంతో ప్రజా రాజధానిగా అమరావతి విశాలాంధ్ర – తిరుమల: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి సన్నిధిలో బుధవారం సాయంత్రం నిర్వహించిన శ్రీ సీతారాముల దివ్య కళ్యాణోత్సవం అనంతరం కళ్యాణ వేదిక వద్ద భక్తులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.జై శ్రీరామ్ నినాదాలతో ముఖ్యమంత్రి వేదికపై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఒంటిమిట్ట శ్రీరాముడు మరియు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి…

Read More

పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ జూన్ నాటికి పూర్తయ్యేనా….?

రువు ప్రాంత ప్రజల కష్టాలు తీరే నా , వలసలు ఆగేనా*? ప్రాజెక్ట్ పూర్తికి బడ్జెట్ తో కాకుండా 4000 కోట్లు నిధులు కేటాయించాలి సీపీఐ రాష్ట కార్యదర్శి జి ఈశ్వరయ్య దోర్నాల పుల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ను ఈ సంవత్సరం జూన్ నాటికి పూర్తిచేస్టారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించ్చారు.గురువారం దోర్నాల వద్ద వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాపనులను సిపిఐ మార్కాపురం జిల్లా నాయకులతో కలిసి ప్రాజెక్ట్ ను…

Read More

6నుంచి ‘పది’ మూల్యాంకనం – Visalaandhra

*ట్యాబ్ లతోతప్పులు లేని దిద్దుబాట్లే లక్ష్యం*డిజిటల్ విధానంతో మార్కుల పరిశీలన (విశాలాంధ్ర-చిత్తూరు) మార్చి 16వ తేదీన ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు గురువారంతో ముగిశాయి. విద్యాశాఖ ఇక మూల్యాంకన ప్రక్రియపై దృష్టి సారించింది. ఈ నెల 6వ తేదీ సోమవారం నుంచి జవాబు పత్రాల దిద్దుబాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. పది రోజుల పాటు ఈ మూల్యాంకనం జరగనుది. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇందుకోసం పక్కా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది…

Read More

అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం – Visalaandhra

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును కేంద్రం.. రాష్ట్రపతికి పంపనుంది. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజిట్‌ నోటిఫికేషన్ విడుదలకానుంది. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి అమల్లోకి రానుంది.  అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎంపీ…

Read More

వణుకుడు వ్యాధికి విరుగుడు డీబీఎస్..

యశోద హాస్పిటల్స్‌లో అద్భుత శస్త్రచికిత్స విజయవంతం మెదడులో ఎలక్ట్రోడ్ల అమరికతో పార్కిన్సన్ బాధితులకు పునర్జన్మ అత్యాధునిక సాంకేతికతతో నిలిచిన హైటెక్ సిటీ యశోద వైద్య బృందం మందులు పనిచేయని దశలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఒక్కటే మార్గం బాధితుల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయి సేవలు విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : పార్కిన్సన్ (వణుకుడు) వ్యాధితో క్రమంగా క్షీణిస్తున్న బాధితులకు అత్యాధునిక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్స ప్రాణవాయువులా మారుతోందని హైదరాబాద్ హైటెక్ సిటీ…

Read More

అఖిలపక్ష సమావేశానికి మోదీ గైర్హాజరు.. ప్రధాని ఎక్కడని నిలదీసిన ఖర్గే

పార్లమెంట్ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. పశ్చిమాసియా సంక్షోభంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకాకపోవడాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ప్రశ్నించారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గట్టిగా బదులివ్వడంతో సభలో కాసేపు వేడి రాజుకుంది. ‘‘పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మీరు అఖిలపక్ష సమావేశం పెట్టారు. ఆ సమావేశానికి ప్రధానమంత్రి ఎందుకు రాలేదు?్ణ్ణ అని ఖర్గే ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇంధన…

Read More

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1400 పాయింట్ల పతనం

అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ భయాలు భారత స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో పెరిగిన చమురు ధరలు.. సూచీలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లకు పైగా కుప్పకూలగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు…

Read More

అమెరికా ప్రజలతో మాకు శత్రుత్వం లేదు: ఇరాన్ అధ్యక్షుడు

అమెరికా ప్రజలతో తమకు ఎలాంటి శత్రుత్వం లేదని, కానీ ఇజ్రాయెల్ కోసం అమెరికా ప్రభుత్వం తమతో ప్రాక్సీ యుద్ధం చేస్తోందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి ఆయన రాసిన బహిరంగ లేఖలో ఈ కీలక ఆరోపణలు చేశారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తమ దేశ వైఖరిని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. అమెరికా ప్రజలతో సహా మరే ఇతర దేశ ప్రజలపైనా ఇరాన్ ప్రజలకు…

Read More

ఐపీఎల్‌లో డబ్బులు తక్కువ… షెడ్యూల్ ఎక్కువ

అందుకే ఆడట్లేదుఆడమ్ జంపాఇస్లామాబాద్: ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా… ఐపీఎల్ 2026 వేలానికి దూరంగా ఉండటంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన నైపుణ్యానికి ఐపీఎల్‌లో సరైన విలువ, డబ్బు లభించడం లేదని, అందుకే ఈ లీగ్‌లో ఆడటం లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం జంపా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎసఎల్)లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ జంపా తన అసంతృప్తిని బయటపెట్టాడు. “ఈ ఏడాది నేను ఐపీఎల్ నుంచి తప్పుకున్నాను….

Read More