‘మైనింగ్’ మాఫియా – Visalaandhra

*అడ్డుగోలుగా లీజు అగ్రిమెంట్లు*ప్రభుత్వానికి పన్ను ఎగవేత*రూ.కోట్లలోఆదాయానికి గండి*మొద్దు నిద్రలో అధికారులు విశాలాంధ్ర-చిత్తూరు : చట్టం వారికి చుట్టం. వారు చెప్పిందే శాసనం. అధికారం వారికి అండగా ఉంది. అందుకే వారిని అడిగే వారే లేరు. నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. అడ్డుగోలుగా లీజు అగ్రిమెంట్లు రాసిస్తున్నారు. కంకర, దుమ్ము అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్నారు. పన్ను ఎగవేస్తూ రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రశ్నించే అధికారుల నోళ్లకు తాళం వేస్తున్నారు. ఒత్తిళ్లు తట్టుకోలేక కొంతమంది అధికారులు రాజీ పడిపోతున్నారు….

Read More

మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్య పెంపు

*జీవీఎంసీలో అత్యధికంగా 120కి చేరిన వార్డులు*తిరుపతి 66, చిత్తూరు 60 వార్డులుగా ఖరారు*ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ పరిపాలన శాఖ విశాలాంధ్ర-చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను పెంచుతూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, పలు కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను సవరిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం…

Read More

దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలి

*మతం మారినంత మాత్రాన కుల వివక్ష పోదు*న్యాయ వ్యవస్థ ద్వారా బీజేపీ తన అజెండాను అమలు చేస్తోంది*దళిత క్రైస్తవులకు అట్రాసిటీ చట్టం వర్తించకపోవడం దుర్మార్గంసీపీఐ జాతీయ కంట్రోల్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ కె.నారాయణ విశాలాంధ్ర-తిరుపతి : దళిత క్రైస్తవులకు ఎస్సీ హక్కులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణ వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, దీనిని వెంటనే పునఃపరిశీలించాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ కె. నారాయణ డిమాండ్ చేశారు….

Read More

మున్సిపల్ ‘వార్డు’ వార్ – Visalaandhra

*కార్పొరేషన్లలో పెరిగిన స్థానాలు*నేతల్లో మొదలైన లెక్కలు*పునర్విభజనతో మారనున్న రాజకీయ ముఖచిత్రం*తిరుపతిలో 66, చిత్తూరులో 60 వార్డులకు పెంపు*మరింత వేడెక్కనున్న మున్సిపల్ ఎన్నికల రాజకీయం విశాలాంధ్ర-చిత్తూరు : మున్సిపల్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను సవరిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం-1955, ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ల రూల్స్-2005 ప్రకారం…

Read More

అమరావతిపై చంద్రబాబుది డ్రామా..: జగన్

అమరావతి రాజధాని నిర్మాణంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రూ.2 లక్షల కోట్ల భారీ ఆర్థిక కుంభకోణంగా అభివర్ణించిన ఆయన, దీనికి ప్రత్యామ్నాయంగా ప్లాన్ బి పేరుతో మావిగన్ అనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ ఈ రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చని ఆయన సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడారు….

Read More

ఇది మా యుద్ధం కాదు..ఈ వివాదంలోకి మమ్మల్ని లాగొద్దు…

ట్రంప్ కు తేల్చిచెప్పిన బ్రిటన్ ప్రధానిమధ్యప్రాచ్యంలో ఇరాన్‌తో ముడిపడిన ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తమ దేశ వైఖరిని కుండబద్దలు కొట్టారు. ఇది మా యుద్ధం కాదు. ఈ వివాదంలోకి మమ్మల్ని లాగొద్దు అని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. దేశ ప్రయోజనాలకే తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, బాహ్య ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు తేల్చిచెప్పారు. ఇరాన్ తో యుద్ధంలో తమతో కలిసి రావడంలేదంటూ ట్రంప్…

Read More

పేదరిక నిర్మూలనకు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యం ఒక శక్తివంతమైన మార్గము

ఇంచార్జ్ ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; పేదరిక నిర్మూలనకు పబ్లిక్, ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యం ఒక శక్తివంతమైన మార్గము అని ఇన్చార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గ స్థాయిలో ఈ రోజు పి4 కార్యక్రమంపై అవగాహన ,సమీక్ష సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన ముఖ్యమంత్రి పి4 కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. కార్యక్రమంలో బంగారు కుటుంబాలు , మార్గదర్శులు అనే భావనలను స్పష్టంగా వివరించారు….

Read More

పోలవరానికి మరో రూ.1,301 కోట్లు.. అడ్వాన్స్‌ నిధుల కింద కేంద్రం విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీగా నిధులు విడుదల చేసింది.తాజాగా రూ.1,301 కోట్ల అడ్వాన్స్‌ నిధులు మంజూరు చేయడంతో, ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం విడుదలైన నిధులు రూ.2,809 కోట్లకు చేరాయి.ఇప్పటికే రూ.1,508 కోట్లు విడుదల కాగా,తాజా కేటాయింపుతో రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన బడ్జెట్ అంచనాలకు దగ్గరగా నిధులు సమీకరించినట్లైంది.గతంలో విడుదలైన రూ.1,508 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పనులకు ప్రాధాన్యత ఇచ్చింది.అందులో రూ.600 కోట్లు…

Read More

మేము ఇరాన్ నుంచి త్వరలోనే వైదొలుగుతాం : ట్రంప్‌

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ లో కొనసాగుతున్న అమెరికా సైనిక చర్యను త్వరలోనే ముగించనున్నట్లు ప్రకటించారు.వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. తమ సైన్యం అతి త్వరలోనే అక్కడి నుంచి వెనక్కి వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మేము ఇరాన్ నుంచి త్వరలోనే వైదొలుగుతాం. బహుశా అది 2 నుంచి 3 వారాల్లో జరిగే అవకాశం ఉంది అంటూ ట్రంప్ వెల్లడించారు.దీంతో పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై కొత్త…

Read More

హెచ్-1బీ వీసా 2027: లాటరీ పూర్తి.. నేటి నుంచి పిటిషన్ల స్వీకరణ

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు కీలకమైన హెచ్-1బీ వీసాకు సంబంధించి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) కీలక ప్రకటన చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వీసాల కోటాకు సరిపడా ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లు అందాయని, లాటరీ ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించింది. ఎంపికైన లబ్ధిదారుల వివరాలను వారి పిటిషనర్లకు తెలియజేశామని పేర్కొంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు తమ యూఎస్‌సీఐఎస్ ఆన్‌లైన్ ఖాతాల ద్వారా తమ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. లాటరీలో ఎంపికైన వారు…

Read More