వాహన నంబర్ నమోదు చేస్తే జీవితాంతం పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందనే ప్రత్యేక ఆచారం ఆ ప్రాంతంలో అమల్లోకి వచ్చింది.
కాకినాడ, తూర్పు గోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా లోవ కొత్తూరు కొండకోన అటవీ ప్రాంతంలో శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయం ఒక ప్రత్యేక ఆచారానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చే భక్తులు తమ వాహనాల నంబర్లను ఆలయం చుట్టూ ఉన్న రాళ్లపై, గోడలపై రాస్తుంటారు. ఈ సంప్రదాయం వెనుక ఒక అద్భుతం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఈ దేవత కొంగు బంగారు తల్లిగా కొలుస్తారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ధారాతీగ కొండల…


